ఏ నామములో - YouWorship
Ae Naamamulo
Artist: అను శామ్యూల్
Category: Praise
Song Lyrics
ఏ నామములో సృష్టి అంతా సృజింపబడెనో ఆ నామమునే స్తుతింతును ఏ నామములో పాపమంతా క్షమించబడెనో ఆ నామమునే పూజింతును ఏ నామములో దావీదు గోలియాతును ఎదురించెనో ఆ నామమునే నమ్మెదను ఏ నామములో ఈ లోకమంతటికి రక్షణ కలుగునో ఆ నామమునే స్మరింతును నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను నీ నామమే ఆధారము నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను నీ నామమే నా జయము రోగము తలవంచును నీ నామము ఎదుట శాపము తల వంగును నీ నామము ఎదుట (2) సాటిలేని నామము – స్వస్థపరచే నామము (2) ||నీ నామమునే|| ప్రతి మోకాలొంగును నీ నామము ఎదుట ప్రతి నాలుక పలుకును ప్రభు యేసుకే ఘనత (2) శ్రేష్టమైన నామము – శక్తిగలిగిన నామము (2) ||నీ నామమునే|| హెచ్చింపబడును గాక నీ నామము యేసయ్యా కీర్తింపబడును గాక నీ నామము యేసయ్యా కొనియాడబడును గాక నీ నామము యేసయ్యా అన్ని నామములకు పై నామముగా (2) అన్ని నామములకు పై నామముగా – (3) ||నీ నామమునే|| Ae Naamamulo Srushti Anthaa Srujimpabadeno Aa Naamamune Sthuthinthunu Ae Naamamulo Paapamanthaa Kshaminchabadeno Aa Naamamune Poojinthunu Ae Naamamulo Daaveedu Goliyaathunu Edurincheno Aa Naamamune Nammedanu Ae Naamamulo Ee Lokamanthatiki Rakshana Kaluguno Aa Naamamune Smarinthunu Nee Naamamune Dhwajamuga Paiketthedanu Nee Naamame Aadharamu Nee Naamamune Dhwajamuga Paiketthedanu Nee Naamame Naa Jayamu Rogamu Thalavanchunu Nee Naamamu Eduta Shapamu Thala Vangunu Nee Naamamu Eduta (2) Saatileni Naamamu – Swasthaparache Naamamu (2) ||Nee Naamamune|| Prathi Mokaalongunu Nee Naamamu Eduta Prathi Naaluka Palukunu Prabhu Yesuke Ghanathaa (2) Sreshtamaina Naamamu – Shakthigaligina Naamamu (2) ||Nee Naamamune|| Hechchimpabadunu Gaaka Nee Naamamu Yesayyaa Keerthimpabadunu Gaaka Nee Naamamu Yesayyaa Koniyaadabadunu Gaaka Nee Naamamu Yesayyaa Anni Naamamulaku Pai Naamamugaa (2) Anni Naamamulaku Pai Naamamugaa – (3) ||Nee Naamamune||