ఏలో ఏలో ఏలో అంటూ - YouWorship
Yelo Yelo Yelo Antu
Artist: జాషువా షేక్
Category: Christmas
Song Lyrics
ఏలో ఏలో ఏలో అంటూ – వచ్చారండి గొల్లలు సంతోషాలే పొంగేనండి – హైలెస్సా దారే చూపే దేవుడొచ్చే – ఉల్లాసంగా ఊరు ఆడే సంగీతాలే పాడాలండి – హైలెస్సా అంధకారాన్ని తొలగించే మహనీయుడు పుట్టినాడండి యేసయ్య మన దేవుడు నిన్నే కోరి – నిన్నే చేరి ఇట్టా రక్షించ వచ్చాడు పరమాత్ముడు ||ఏలో|| లోకాలనేలేటి రారాజురా – ఉదయించే సూరీడై వచ్చాడురా ఆకాశ వీధి – మెరిసేటి దారి – ఒక తార మురిసిందిగా (2) దూతాళి పాడి – కొలిచారు చూడు – ఘనమైన ఒక వేడుక ఆ గొల్లలేగా – దరువేసే చూడు – మెస్సయ్య పుట్టాడని మన మెస్సయ్య పుట్టాడని ||ఏలో|| వెన్నెల్లో పూసింది ఓ సందడి – పలికింది ఊరంతా ఈ సంగతి ఈ దీనుడంట – పసిబాలుడంట – వెలిసాడు మహరాజుగా (2) మనసున్నవాడు – దయ చూపువాడు – అలనాటి అనుబంధమే కనులారా చూడు – మనసారా వేడు – దిగి వచ్చె మనకోసమే ఇల దిగి వచ్చె మనకోసమే ||ఏలో|| ఆ నింగి తారల్లా వెలగాలిరా – జగమంత చూసేలా బ్రతకాలిరా వెలిగించు వాడు – మనలోని వాడు – నిలిచాడు మన తోడుగా (2) సలి గాలి రాత్రి – పిలిసింది సూడు – మనలోన ఒక పండగ భయమేల నీకు – దిగులేల నీకు – యేసయ్య మనకుండగా మన యేసయ్య మనకుండగా ||ఏలో|| Yelo Yelo Yelo Antu – Vachchaarandi Gollalu Santhoshaale Pongenandi – Hailessaa Daare Choope Devudochche – Ullaasanga Ooru Aade Sangeethaale Paadaalandi – Hailessa Andhakaaraanni Tholaginche Mahaneeyudu Puttinaadandi Yesayya Mana Devudu Ninne Kori – Ninne Cheri Ittaa Rakshincha Vachhadu – Paramaathmudu ||Yelo|| Lokaalaneleti Raaraajura – Udayinche Sooreedai Vachchaaduraa Aakaasa Veedhi – Meriseti Daari – Oka Thaara Murisindigaa (2) Doothaali Paadi – Kolichaaru Choodu – Ghanamaina Oka Veduka Aa Gollalegaa – Daruvese Choodu – Messayya Puttaadani Mana Messayya Puttaadani ||Yelo|| Vennello Poosindi Oka Sandadi – Palikindi Ooranthaa Ee Sangathi Ee Deenudanta – Pasi Baaludanta – Velisaadu Maharaajugaa (2) Manasunnavaadu – Daya Choopuvaadu – Alanaati Anubandhame Kanulaaraa Choodu – Manasaaraa Vedu – Digivachche Mana Kosame Ila Digivachche Mana Kosame ||Yelo|| Aa Ningi Thaaralla Velagaaliraa – Jagamantha Chooselaa Brathakaaliraa Veliginchuvaadu – Manalonivaadu – Nilichaadu Mana Thodugaa (2) Sali Gaali Raathri – Pilisindi Soodu – Manalona Oka Pandaga Bhayamela Neeku – Digulela Neeku – Yesayya Manakundagaa Mana Yesayya Manakundagaa ||Yelo||