ఏమి నేను సమర్పింతు - YouWorship
Emi Nenu Samarpinthu
Artist: పులిపాక జగన్నాథము
Category: Praise & Worship
Song Lyrics
ఏమి నేను సమర్పింతు - యేసూ - యెట్లు నిన్ను స్తుతియింతు ఏమి సమర్పింతు - హీనుండ నగు నేను - గామితార్థము లెల్ల గలుగంజేయు నీకు ||ఏమి|| 1. నేను మార్గముం దప్పియుండంగ - నన్ను - నీవు కంటివి కరుణ నిండంగ దీనపాపులను - దృఢముగం బ్రోవను - దాన మిచ్చితివి - తనర నీ ప్రాణము ||ఏమి|| 2. అందరి కొరకీవు తెచ్చిన - మిగుల - అందమైన నిత్య రక్షణ అంది నిన్ను వినతి - పొందుగం జేసెద - నొందుమా నా నుతి నుత్తమ ప్రభు క్రీస్తు ||ఏమి|| 3. నీ యందే యానంద మొందంగ - యేసు - నీదైన యాత్మ నాకందంగ జేయు మంచు నీకు జేసెదం ప్రార్థన - నాయందు దయచేసి నా మనవి నాలించు ||ఏమి|| 4. నేను జేసిన యఘము లెన్ను - కర్త - నీ యెదుట దలంచుకొందును నేను సిగ్గు నొంది - నిజముగం గుందుచు - నేను వేండుకొందు నీ క్షమాపణ కొరకు ||ఏమి|| 5. నన్ను నీవు స్థిరపరచుము - కర్త - యన్నిట నను బలపరుచుము తిన్నని మార్గమున - దృఢముగ నేగుచు - నిన్ను నే స్తుతియింతు నిండుగ నెల్లప్పుడు ||ఏమి|| Emi Nenu Samarpinthu - Yesoo - Yetlu Ninnu Sthuthiyinthu Emi Samarpinthu - Heenunda Nagu Nenu - Gaamithaarthamu Lella Galuganjeyu Neeku ||Emi|| 1. Nenu Maargamum Dappiyundanga - Nannu - Neevu Kantivi Karuna Nindanga Deenapaapulanu - Drudhamugam Brovanu - Daana Michchithivi - Thanara Nee Praanamu ||Emi|| 2. Andari Korakeevu Thechchina - Migula - Andamaina Nithya Rakshana Andi Ninnu Vinathi - Pondugam Jeseda - Nondumaa Naa Nuthi Nuththama Prabhu Kreesthu ||Emi|| 3. Nee Yande Yaananda Mondanga - Yesu - Needaina Yaathma Naakandanga Jeyu Manchu Neeku Jesedam Praarthana - Naayandu Dayachesi Naa Manavi Naalinchu ||Emi|| 4. Nenu Jesina Yaghamu Lennu - Kartha - Nee Yeduta Dalanchukondunu Nenu Siggu Nondi - Nijamugam Gunduchu - Nenu Vendukondu Nee Kshamaapana Koraku ||Emi|| 5. Nannu Neevu Sthiraparachumu - Kartha - Yannita Nanu Balaparuchumu Thinnani Maargamuna - Drudhamuga Neguchu - Ninnu Ne Sthuthiyinthu Ninduga Nellappudu ||Emi||