ఎవరు జయించెదరో - YouWorship
Evaru Jayinchedaro
Artist: సీయోను గీతాలు
Category: Encouraging
Song Lyrics
పల్లవి: ఎవరు జయించెదరో - వారే సమస్తమును పొందెదరు 1. ఎవరు కష్ట బాధ లోర్చెదరో - పట్టువదలక ప్రభుతో నుండు వారే దిట్టముగా నత్యధిక విజయమును పొంది గట్టిగా నిలిచెదరు వారెల్లరు ప్రభులో 2. ఎవరు శోధనలను జయింతురో - జీవమకుటము వారే పొందెదరు పావనుడైన పరమ క్రీస్తేసు తోడ పరిపాలింతురు ప్రభుని దివ్య రాజ్యములో 3. ఎవరు లోకాశలను జయింతురో - వారే సైతానును ఓడింతురు పరిపూర్ణముగా ప్రభుని బలము గలవారై పరలోక స్వాస్థ్యమును పొందెదరు 4. ఎవరు క్రీస్తేసు సంబంధులో - వారే పాప మరణము జయింతురు ఓ మరణమా నీ ముల్లెక్కడ యనుచు వీక్షింతురు పరమ విభుని రాకడ కొరకై 5. ఎవరు ప్రభు సేవను చేసెదరో - వారే పొందెదరు బహుమానము ఓరిమి కలిగి పరుగును ముగించి మురిసెదరు హల్లెలూయ పాటలతో Pallavi: Evaru Jayinchedaro - Vaare Samasthamunu Pondedaru 1. Evaru Kashta Baadha Lorchedaro - Pattuvadalaka Prabhutho Nundu Vaare Dittamugaa Nathyadhika Vijayamunu Pondi Gattigaa Nilichedaru Vaarellaru Prabhulo 2. Evaru Shodhanalanu Jayinthuro - Jeevamakutamu Vaare Pondedaru Paavanudaina Parama Kreesthesu Thoda Paripaalinthuru Prabhuni Divya Raajyamulo 3. Evaru Lokaashalanu Jayinthuro - Vaare Saithaanunu Odinthuru Paripoornamugaa Prabhuni Balamu Galavaarai Paraloka Svaasthyamunu Pondedaru 4. Evaru Kreesthesu Sambandhulo - Vaare Paapa Maranamu Jayinthuru O Maranamaa Nee Mullekkada Yanuchu Veekshinthuru Parama Vibhuni Raakada Korakai 5. Evaru Prabhu Sevanu Chesedaro - Vaare Pondedaru Bahumaanamu Orimi Kaligi Parugunu Muginchi Murisedaru Hallelooya Paatalatho