ఎవరు చూపించలేని - YouWorship
Evaru Choopinchaleni
Artist: జాషువా షేక్
Category: Praise
Song Lyrics
ఎవరు చూపించలేని – ఇలలో నను వీడిపోని ఎంతటి ప్రేమ నీది – ఇంతగా కోరుకుంది – మరువను యేసయ్యా (2) నీ కథే నన్నే తాకగా – నా మదే నిన్నే చేరగా నా గురే నీవై యుండగా – నీ దరే నే చేరానుగా ||ఎవరు|| తీరాలే దూరమాయే – కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావే – కన్నీటి కానుకాయే నా గుండె లోతులోన – నే నలిగిపోతువున్నా ఏ దారి కానరాక – నీ కొరకు వేచివున్నా ఎడబాటులేని గమనాన – నిను చేరుకున్న సమయాన నను ఆదరించే ఘన ప్రేమ – అపురూపమైన తొలిప్రేమ ఏకమై తోడుగా – ఊపిరే నీవుగా ఎవ్వరూ లేరుగా – యేసయ్యా నీవెగా ||ఎవరు|| ఈ లోక జీవితాన – వేసారిపోతువున్నా విలువైన నీదు వాక్యం – వెలిగించె నా ప్రాణం నీ సన్నిధానమందు – సీయోను మార్గమందు నీ దివ్య సేవలోనే – నడిపించే నా ప్రభూ నీ తోటి సాగు పయనాన – నను వీడలేదు క్షణమైన నీ స్వరము చాలు ఉదయాన – నిను వెంబడించు తరుణాన శాశ్వత ప్రేమతో – సత్యవాక్యంబుతో నిత్యము తోడుగా – నిలిచె నా యేసయ్యా ||ఎవరు|| Evaru Choopinchaleni – Ilalo Nanu Veediponi Enthati Prema Needi – Inthagaa Korukundi – Maruvanu Yesayyaa (2) Nee Kathe Nanne Thaakagaa – Naa Madhe Ninne Cheragaa Naa Gure Neevai Yundagaa – Nee Dhare Ne Cheraanugaa ||Evaru|| Theeraale Dooramaaye – Kaalaale Maaripoye Eduraina Endamaave – Kanneeti Kaanukaaye Naa Gunde Lothulona – Ne Naligipothuvunnaa Ae Daari Kaanaraaka – Nee Koraku Vechi Unnaa Edabaatu Leni Gamanaana – Ninu Cherukunna Samayaana Nanu Aadarinche Ghana Prema – Apuroopamaina Tholi Prema Ekamai Thodugaa – Oopire Neevugaa Evvaru Lerugaa – Yesayyaa Neevegaa ||Evaru|| Ee Loka Jeevithaana – Vesaaripothuvunnaa Viluvaina Needu Vaakyam – Veliginche Naa Praanam Nee Sannidhaanamandu – Seeyonu Maargamandu Nee Divya Sevalone – Nadipinche Naa Prabhu Nee Thoti Saagu Payanaana – Nanu Veedaledu Kshanamaina Nee Swaramu Chaalu Udayaana – Ninu Vembadinchu Tharunaana Shaashwatha Prematho – Sathya Vaakyambutho Nithyamu Thodugaa – Niliche Naa Yesayyaa ||Evaru||