ఎవరి కోసమో - YouWorship
Evari Kosamo Ee Praana Thyaagamu
Artist: Unknown Artist
Category: Good Friday
Song Lyrics
ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము (2) నీ కోసమే నా కోసమే కలువరి పయనం – ఈ కలువరి పయనం (2) ||ఎవరి|| ఏ పాపము ఎరుగని నీకు – ఈ పాప లోకమే సిలువ వేసిందా ఏ నేరము తెలియని నీకు – అన్యాయపు తీర్పునే ఇచ్చిందా (2) మోయలేని మ్రానుతో మోముపైన ఉమ్ములతో నడువలేని నడకలతో తడబడుతూ పోయావా సోలి వాలి పోయావా…. ||ఎవరి|| జీవకిరీటం మాకు ఇచ్చావు – ముళ్ళ కిరీటం నీకు పెట్టాము జీవ జలములు మాకు ఇచ్చావు – చేదు చిరకను నీకు ఇచ్చాము (2) మా ప్రక్కన ఉండి మమ్ము కాపాడుచుండగా నీ ప్రక్కలో బళ్ళెముతో – ఒక్క పోటు పొడిచితిమి తండ్రీ వీరు చేయునదేదో వీరెరుగరు వీరిని క్షమించు, వీరిని క్షమించు అని వేడుకొన్నావా… పరమ తండ్రిని ||ఎవరి|| Evari Kosamo Ee Praana Thyaagamu (2) Nee Kosame Naa Kosame Kaluvari Payanam – Ee Kaluvari Payanam (2) ||Evari|| Ae Paapamu Erugani Neeku – Ee Paapa Lokame Siluva Vesindaa Ae Neramu Theliyani Neeku – Anyaayapu Theerpune Ichchindaa (2) Moyaleni Mraanutho Momu Paina Ummulatho Naduvaleni Nadakalatho Thadabaduthu Poyaavaa Soli Vaali Poyaavaa… ||Evari|| Jeeva Kireetam Maaku Ichchaavu – Mulla Kireetam Neeku Pettaamu Jeeva Jalamulu Maaku Ichchaavu – Chedu Chirakanu Neeku Ichchaamu (2) Maa Prakkana Undi Mammu Kaapaaduchundagaa Nee Prakkalo Ballemutho – Okka Potu Podichithimi Thandri Veeru Cheyunadedo Veererugaru Veerini Kshaminchu, Veerini Kshaminchu Ani Vedukonnaavaa.. . Parama Thandrini ||Evari||