ఎల్లప్పుడు ఎల్లప్పుడు ఎల్లప్పుడు సంతోషము - YouWorship
Ellappudu Ellappudu Ellappudu Santhoshamu
Artist: సీయోను గీతాలు
Category: Encouraging
Song Lyrics
పల్లవి: ఎల్లప్పుడు ఎల్లప్పుడు ఎల్లప్పుడు సంతోషము - యేసు నాతోకూడ నున్నందున (2) 1. ఎల్లను పెంటతోడ తుల్యము - నరు - లెల్లరును మన్నై పోవుదురు (1) రంగుగ ప్రియ యేసు మిత్రుడు నాకుండ - మంగళముగ నుందు కొదువలేదు (1) 2. తల్లి దండ్రులాప్తుల్ మరణమైన - నింక - నెల్ల స్నేహియులు గతించినన్ రాజుయేసుక్రీస్తు ప్రకాశమిత్రుడు కొదువలేదు నాకు దిగులు లేదు 3. కావలివాడు నిద్రపోడు కున్కడు - ఆశ ప్రేమ కలిగినవాడు పదివేలు కత్తివాతన్ ప్రక్క కూలిన దిగులొందను నేను భయమొందను 4. ఇహలోహ సత్రంబు నందున్నను - స్వర్గ - గృహము పైన నాకు నిత్యముండున్ అచ్చట శాశ్వతంబుగ నుందుగాన నా కిచ్చట సతతమని ఎటులందును 5. ఈ నరులు నన్ను బహుతిట్టి దూషించిన -నా పేరు చెరుప ప్రయత్నించిన బదులు చెప్పను నా నాలుక నెత్తను యేసు వలె వారి కరుణింతును 6. ఎట్టి శ్రమలు కష్టనష్టములున్న - దుష్ట సైతానుడు ఎదిరించిన భయపడను నా కపాయము కలుగదు నా యేసు నాకు జయవీరుడు 7. ఆదరించు వారలాప్తులెల్లరు - ఈ భూతలమును వీడిపోయినను పరమ ఆదరణ కర్త యేసు వెంట ప్రేరేపితుడనై ఏగుదు నెల్లడన్ 8. నా మిత్రుని చేయిబట్టి - నే నిల్తును - నా శత్రుని జయింతు - ప్రభు శక్తిచే వాక్య ఖడ్గంబును - విల్లును ధరియించి విజయంబు నొందెద - వీరునిగా Pallavi: Ellappudu Ellappudu Ellappudu Santhoshamu - Yesu Naathokooda Nunnanduna (2) 1. Ellanu Pentathoda Thulyamu - Naru - Lellarunu Mannai Povuduru (1) Rangguga Priya Yesu Mithrudu Naakunda - Manggalamuga Nundu Koduvaledu (1) 2. Thalli Dandrulaapthul Maranamaina - Ningka - Nella Snehiyulu Gathinchinan RaajuYesuKreesthu Prakaashamithrudu Koduvaledu Naaku Digulu Ledu 3. Kaavalivaadu Nidrapodu Kunkadu - Aasha Prema Kaliginavaadu Padivelu Kaththivaathan Prakka Koolina Digulondanu Nenu Bhayamondanu 4. Ihaloha Sathrambu Nandunnanu - Svarga - Gruhamu Paina Naaku Nithyamundun Achchata Shaashvathambuga Nundugaana Naa Kichchata Sathathamani Etulandunu 5. Ee Narulu Nannu Bahuthitti Dooshinchina -Naa Peru Cherupa Prayathninchina Badulu Cheppanu Naa Naaluka Neththanu Yesu Vale Vaari Karuninthunu 6. Etti Shramalu Kashtanashtamulunna - Dushta Saithaanudu Edirinchina Bhayapadanu Naa Kapaayamu Kalugadu Naa Yesu Naaku Jayaveerudu 7. Aadarinchu Vaaralaapthulellaru - Ee Bhoothalamunu Veedipoyinanu Parama Aadarana Kartha Yesu Venta Prerepithudanai Egudu Nelladan 8. Naa Mithruni Cheyibatti - Ne Nilthunu - Naa Shathruni Jayinthu - Prabhu Shakthiche Vaakya Khadgambunu - Villunu Dhariyinchi Vijayambu Nondeda - Veerunigaa