ఎల్లప్పుడును ప్రభువునందు - YouWorship
Ellappudunu Prabhuvunandu
Artist: క్రాంతి చేపూరి
Category: Encouraging
Song Lyrics
ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించండి ప్రతి సమయములోను… ప్రతి పరిస్థితిలోను ఆనందించండి (2) యెహోవా చేసిన మేలుల కొరకై ఎల్లప్పుడును ఆనందించండి (2) ఆరాధించండి ||ఎల్లప్పుడును|| పాపంబు తోడ చింతించుచుండ నరునిగా ఈ భువిలో ఉదయించెగా మన పాప భారం తన భుజమున మోసి మనకై తన ప్రాణం అర్పించెగా (2) ఉచితార్ధమైన రక్షణను నొసగి నీతిమంతుని చేసి ఉల్లాస వస్త్రమును ధరియింపజేసి యున్నాడు గనుకే ||ఎల్లప్పుడును|| విశ్వాసమునకు కలిగే పరీక్ష ఓర్పును కలిగించే ఒక సాధనమై శోధనకు నిలిచి సహించిన వేళ జీవ కిరీటమును పొందెదము (2) నానా విధాలైన శోధనలో పడినప్పుడు ఆనందించండి సంపూర్ణులుగాను కొదువే లేని ఓర్పును కొనసాగించండి ||ఎల్లప్పుడును|| ప్రతి బాష్ప బిందువును తుడిచి వేసి మరణము దుఃఖము ఏడ్పును దూరము చేసి మనతో నివాసమును కలిగి యుండుటకు త్వరలోనే రారాజుగా రానైయుండె (2) శుభప్రదమైన నిరీక్షణతో కాచియుండండి సిద్ధమైన మనస్సును కలిగి వేచియుండండి ||ఎల్లప్పుడును|| Ellappudunu Prabhuvunandu Aanandinchandi Prathi Samayamulonu… Prathi Paristhithilonu Aanandinchandi (2) Yehovaa Chesina Melula Korakai Ellappudunu Aanandinchandi (2) Aaraadhinchandi ||Ellappudunu|| Paapambu Thoda Chinthinchuchunda Narunigaa Ee Bhuvilo Udayinchegaa Mana Paapa Bhaaram Thana Bhujamuna Mosi Manakai Thana Praanam Arpinchegaa (2) Uchithaardhamaina Rakshananu Nosagi Neethimanthuni Chesi Ullaasa Vasthramunu Dhariyimpajesi Yunnaadu Ganuke ||Ellappudunu|| Vishwaasamunaku Kalige Pareeksha Orpunu Kaliginche Oka Saadhanamai Shodhanaku Nilichi Sahinchina Vela Jeeva Kireetamunu Pondedamu (2) Naanaa Vidhaalaina Shodhanalo Padinappudu Aanandinchandi Sampoornulugaanu Koduve Leni Orpunu Konasaaginchandi ||Ellappudunu|| Prathi Baashpa Binduvunu Thudichi Vesi Maranamu Dukhamu Edpunu Dooramu Chesi Manatho Nivaasamunu Kaligi Yundutaku Thvaralone Raaraajugaa Raanaiyunde (2) Shubhapradamainaa Nireekshanatho Kaachiyundandi Siddhamaina Manassunu Kaligi Vechiyundandi ||Ellappudunu||