ఎడబాయని నీ కృప - YouWorship
Edabaayani Nee Krupa
Artist: మాథ్యూస్
Category: Comfort
Song Lyrics
ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ (2) యేసయ్యా నీ ప్రేమానురాగం నను కాయును అనుక్షణం (2) ||ఎడబాయని|| శోకపు లోయలలో – కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో – నిరాశ నిసృహలో (2) అర్ధమేకాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా (2) కృపా కనికరముగల దేవా నా కష్టాల కడలిని దాటించితివి (2) ||ఎడబాయని|| విశ్వాస పోరాటములో – ఎదురాయె శోధనలు లోకాశల అలజడిలో – సడలితి విశ్వాసములో (2) దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా (2) దీర్ఘశాంతముగల దేవా నా చేయి విడువక నడిపించితివి (2) ||ఎడబాయని|| నీ సేవలో ఎదురైన – ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని – నిరాశ చెందితిని (2) భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా (2) ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరిచితివి (2) ||ఎడబాయని|| Edabaayani Nee Krupa Nanu Viduvadu Ennatiki (2) Yesayyaa Nee Premaanuraagam Nanu Kaayunu Anukshanam (2) ||Edabaayani|| Shokapu Loyalalo – Kashtaala Kadagandlalo Kadaleni Kadalilo – Niraasha Nispruhalo (2) Ardhame Kaani Ee Jeevitham Ika Vyardhamani Nenanukonagaa (2) Krupaa Kanikaramugala Devaa Naa Kashtaala Kadalini Daatinchithivi (2) ||Edabaayani|| Vishwaasa Poraatamulo – Eduraaye Shodhanalu Lokaashala Alajadilo – Sadalithi Vishwaasamulo (2) Dushtula Kshemamune Choochi Ika Neethi Vyardhamani Anukonagaa (2) Deerghashaanthamugala Devaa Naa Cheyi Viduvaka Nadipinchithivi (2) ||Edabaayani|| Nee Sevalo Eduraina – Enno Samasyalalo Naa Balamunu Choochukoni – Niraasha Chendithini (2) Bhaaramaina Ee Sevanu Ika Cheyalenani Anukonagaa (2) Pradhaana Yaajakudaa Yesu Nee Anubhavaalatho Balaparachithivi (2) ||Edabaayani||