ఎటు చూచినా - YouWorship
Etu Choochinaa
Artist: Unknown Artist
Category: Second Coming
Song Lyrics
ఎటు చూచినా యుద్ధ సమాచారాలు ఎటు చూచినా కరువూ భూకంపాలు ఎటు చూచినా దోపిడీ దౌర్జన్యాలు ఎటు చూచినా ఎన్నో అత్యాచారాలు ఓ సోదరా ఓ సోదరీ (2) రాకడ గురుతులని తెలుసుకోవా తినుటకు త్రాగుటకు ఇది సమయమా ||ఎటు|| మందసము నీ ప్రజలు – గుడారములో నివసిస్తుండగ యోవాబుని సేవకులు దండులో నుండగను (2) తినుటకు త్రాగుటకు భార్యతో నుండుటకు (2) ఇది సమయమా.. ఇది సమయమా.. అని ఆనాడు ఊరియా దావీదునడిగాడు ఈనాడు నిన్ను కూడా ప్రభువు అడుగుచున్నాడు ||ఎటు|| నా పితరుల యొక్క – సమాధులుండు పట్టణము పాడైపోయెను పాడైపోయెను (2) యెరూషలేము గుమ్మములు అగ్ని చేత కాల్చబడగా (2) సంతోషముగ నుండుటకు ఇది సమయమా.. అని ఆనాడు నెహెమ్యా పర రాజునడిగాడు ఈనాడు నిన్ను కూడా ప్రభువు అడుగుచున్నాడు ||ఎటు|| ఈనాడు దేశంలో ఎన్నో ఎన్నో దౌర్జన్యాలు సజీవ దహనాలు స్త్రీల మానభంగాలు (2) ఎన్నో గుడులు నేల మట్టం చేయబడుచుండగా (2) తినుటకు త్రాగుటకు ఇది సమయమా అని నీ సృష్టికర్తగు యేసు నిన్ను అడుగుచున్నాడు ఈనాడు దేశం కొరకు ప్రార్ధించమన్నాడు ||ఎటు|| Etu Choochinaa Yuddha Samaachaaraalu Etu Choochinaa Karuvu Bhookampaalu Etu Choochinaa Dopidee Dourjanyaalu Etu Choochinaa Enno Athyaachaaraalu O Sodaraa O Sodaree (2) Raakada Guruthulani Thelusukovaa Thinutaku Thraagutaku Idi Samayamaa ||Etu|| Mandasamu Nee Prajalu – Gudaaramulo Nivasisthundaga Yovaabuni Sevakulu Dandulo Nundaganu (2) Thinutaku Thraagutaku Bhaaryatho Nundutaku (2) Idi Samayamaa.. Idi Samayamaa.. Ani Aanaadu Ooriyaa Daaveedunadigaadu Eenaadu Ninnu Koodaa Prabhuvu Aduguchunnaadu ||Etu|| Naa Pitharula Yokka – Samaadhulundu Pattanamu Paadaipoyenu Paadaipoyenu (2) Yerushalemu Gummamulu Agni Chetha Kaalchabadagaa (2) Santhoshamuga Nundutaku Idi Samayamaa.. Ani Aanaadu Nehemyaa Para Raajunadigaadu Eenaadu Ninnu Koodaa Prabhuvu Aduguchunnaadu ||Etu|| Eenaadu Deshamlo Enno Enno Dourjanyaalu Sajeeva Dahanaalu Sthreela Maanabhangaalu (2) Enno Gudulu Nela Mattam Cheyabaduchundagaa (2) Thinutaku Thraagutaku Idi Samayamaa Ani Nee Srushtikarthagu Yesu Ninnu Aduguchunnaadu Eenaadu Desham Koraku Praardhinchamannaadu ||Etu||