ఎందుకో ఈ ప్రేమ - YouWorship
Enduko Ee Prema
Artist: Unknown Artist
Category: Worship
Song Lyrics
ఎందుకో ఈ ప్రేమ నన్నింతగ ప్రేమించెను ఎందుకో ఈ జాలి నాపై కురిపించెను (2) ఏ యోగ్యత లేని ఓటి కుండను నీ పాత్రగ చేసి ఎన్నుకుంటివి (2) ఎనలేని కృపనిచ్చితివి ||ఎందుకో|| నీ సన్నిధి పలుమార్లు నే వీడినానే అయినా నీవు క్షమియించినావే ఊహించని మేలులతో దీవించినావే నా సంకటములను కదా తీర్చినవే (2) ఏ యోగ్యత లేని దీనుడను ఏమివ్వగలను నీ ప్రేమకు (నా) సర్వం నీకే అర్పింతును – (2) ||ఎందుకో|| మా కొరకు బలి పశువై మరణించినావు మా పాప శిక్ష తొలగించినావు పలు విధముల శోధనలో తోడైనావు ఏ కీడు రాకుండ మేము కాచినావు (2) రుచి చూపినావు నీ ప్రేమను ఆ ప్రేమలో నేను జీవింతును నీవే నాకు ఆధారము – (2) ||ఎందుకో|| Enduko Ee Prema Nanninthaga Preminchenu Enduko Ee Jaali Naapai Kuripinchenu (2) Ae Yogyatha Leni Oti Kundanu Nee Paathraga Chesi Ennukuntivi (2) Enaleni Krupanichchithivi ||Enduko|| Nee Sannidhi Palumaarlu Ne Veedinaane Ainaa Neevu Kshamiyinchinaave Oohinchani Melulatho Deevinchinaave Naa Sankatamulanu Kada Theerchinaave (2) Ae Yogyatha Leni Deenudanu Emivvagalanu Nee Premaku (Naa) Sarvam Neeke Arpinthunu – (2) ||Enduko|| Maa Koraku Bali Pashuvai Maraninchinaavu Maa Paapa Shiksha Tholaginchinaavu Palu Vidhamula Shodhanalo Thodainaavu Ae Keedu Raakunda Mamu Kaachinaavu (2) Ruchi Choopinaavu Nee Premanu Aa Premalo Nenu Jeevinthunu Neeve Naaku Aadhaaramu – (2) ||Enduko||