ఎంత ప్రేమించెనో - YouWorship
Entha Premincheno
Artist: చదలవాడ జకర్యా
Category: Praise
Song Lyrics
ఎంత ప్రేమించెనో - దేవుండు మనపై - నెంతదయంజూపెనో వింతగల యీ దైవప్రేమను - సాంతమున ధ్యానింపరే ||ఎంత|| 1. పనికిమాలిన పాపాత్ములమైన మనము ఆ - ఘనదేవునికి పిల్లలమనబడుటకై తన కుమారుని మరణ బలిరక్తమున మన - లను స్వీకరించుకొనెను దీనిని జూడరే ||ఎంత|| 2. పెంటకుప్పమోంద పడియున్న యీ నీచ - మంటి పురుగులను లేవనెత్తి మింటిపై ఘనులతోం గూర్చుండంజేయ నీ - మంటి కేతెంచె మన వంటి దేహము దాల్చి ||ఎంత|| 3. ద్రాక్షారసపు మధురమును మించి యీ ప్రేమ - సాక్షాత్తుగా మనపయినుండగా ఈ క్షితినా ప్రేమ ద్రాక్షారసముకంటె - దీక్షగవేడి యపేక్షింపతగునాహా ||ఎంత|| 4. మనలను ప్రేమించి తన ప్రాణమిచ్చిన - ఘనుండా కాశమునుండి మరలి వచ్చి మన దైన్యదేహమును తనరూపముకు మార్చి - కొనిపోయి తన రాజ్యమును మనకీయును ||ఎంత|| 5. గట్టిగ మనమునం దిట్టి నిరీక్షణ - పెట్టియున్న సత్ క్రైస్తవులూ డెట్టివాండొ మనమునట్టి వారుగ ప్రభుని - కట్టడలను మదిని బెట్టియుందము వేడ్క ||ఎంత|| Entha Premincheno - Devundu Manapai - Nenthadayanjoopeno Vinthagala Yee Daivapremanu - Saanthamuna Dhyaanimpare ||Entha|| 1. Panikimaalina Paapaathmulamaina Manamu Aa - Ghanadevuniki Pillalamanabadutakai Thana Kumaaruni Marana Balirakthamuna Mana - Lanu Sveekarinchukonenu Deenini Joodare ||Entha|| 2. Pentakuppamonda Padiyunna Yee Neecha - Manti Purugulanu Levaneththi Mintipai Ghanulathon Goorchundanjeya Nee - Manti Kethenche Mana Vanti Dehamu Daalchi ||Entha|| 3. Draakshaarasapu Madhuramunu Minchi Yee Prema - Saakshaaththugaa Manapayinundagaa Ee Kshithinaa Prema Draakshaarasamukante - Deekshagavedi Yapekshimpathagunaahaa ||Entha|| 4. Manalanu Preminchi Thana Praanamichchina - Ghanundaa Kaashamunundi Marali Vachchi Mana Dainyadehamunu Thanaroopamuku Maarchi - Konipoyi Thana Raajyamunu Manakeeyunu ||Entha|| 5. Gattiga Manamunan Ditti Nireekshana - Pettiyunna Sath Kraisthavuloo Dettivaando Manamunatti Vaaruga Prabhuni - Kattadalanu Madini Bettiyundamu Vedka ||Entha||