ఎంత జాలి యేసువా - YouWorship
Entha Jaali Yesuvaa
Artist: Unknown Artist
Category: Worship
Song Lyrics
ఎంత జాలి యేసువా యింతయని యూహించలేను ||ఎంత|| హానికరుడ హింసకుడను దేవదూషకుడను నేను (2) అవిశ్వాసినైన నన్ను (2) ఆదరించినావుగా ||ఎంత|| రక్షకుండ నాకు బదులు శిక్ష ననుభవించినావు (2) సిలువయందు సొమ్మసిల్లి (2) చావొందితివి నాకై ||ఎంత|| ఏమి నీ కర్పించగలను ఏమి లేమి వాడనయ్యా (2) రక్షణంపు పాత్రనెత్తి (2) స్తొత్రమంచు పాడెద ||ఎంత|| నీదు నామమునకు యిలలో భయపడెడు వారి కొరకై (2) నాథుడా నీ విచ్చు మేలు (2) ఎంత గొప్పదేసువా ||ఎంత|| నేను బ్రతుకు దినములన్ని క్షేమమెల్ల వేళలందు (2) నిశ్చయముగ నీవు నాకు (2) ఇచ్చువాడా ప్రభువా ||ఎంత|| నాదు ప్రాణమునకు ప్రభువా సేద దీర్చు వాడ వీవు (2) నాదు కాపరివి నీవు (2) నాకు లేమి లేదుగా ||ఎంత|| అందరిలో అతి శ్రేష్ఠుండా అద్వితీయుడగు యేసయ్యా (2) హల్లెలూయ స్తోత్రములను (2) హర్షముతో పాడెద ||ఎంత|| Entha Jaali Yesuvaa Inthayani Oohinchalenu ||Entha|| Haanikaruda Himsakudanu Devadooshakudanu Nenu (2) Avishwaasinaina Nannu (2) Aadarinchinaavugaa ||Entha|| Rakshakundaa Naaku Badulu Shiksha Nanubhavinchaavu (2) Siluvayandu Sommasilli (2) Chaavondithivi Naakai ||Entha|| Emi Neekarpinchagalanu Emi Lenivaadanayyaa (2) Rakshanampu Paathranetthi (2) Sthothramanchu Paadeda ||Entha|| Needu Naamamunaku Ilalo Bhayapadedu Vaari Korakai (2) Naathudaa Neevichchu Melu (2) Entha Goppadesuvaa ||Entha|| Nenu Brathuku Dinamulanni Kshemamella Velalandu (2) Nischayamuga Neevu Naaku (2) Ichchuvaadaa Prabhuvaa ||Entha|| Naadu Praanamunaku Prabhuvaa Sedadeerchu Vaada Veevu (2) Naadu Kaaparivi Neevu (2) Naaku Lemi Ledugaa ||Entha|| Andarilo Athi Sreshtundaa Advitheeyudagu Yesayyaa (2) Hallelooya Sthothramulanu (2) Harshamutho Paadeda ||Entha||