ఎంతో సుందరుడమ్మ తాను - YouWorship
Entho Sundarudamma Thaanu
Artist: ఎం ప్రశాంత్ రాజు
Category: Praise
Song Lyrics
ఎంతో సుందరుడమ్మ తాను… ఎంతో సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయినాను (2) ||ఎంతో|| ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు (2) అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు (2) ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు – (2) ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండు (2) అవలీలగా నతని గురితింపగలనమ్మా (2) ||ఎంతో|| కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు (2) మరులు మనసున నింపు మహనీయుడాతండు (2) కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు మరులు మనసున నింపు మహనీయుడాతండు – (2) సిరులు కురిపించేను వర దేవ తనయుండు (2) విరబూయు పరలోక షారోను విరజాజి (2) ||ఎంతో|| పాలతో కడిగిన నయనాలు గలవాడు (2) విలువగు రతనాల వలె పొదిగిన కనులు (2) పాలతో కడిగిన నయనాలు గలవాడు విలువగు రతనాల వలె పొదిగిన కనులు – (2) కలుషము కడిగిన కమలాల కనుదోయి (2) విలువైన చూపొసఁగె వరమేరి తనయుండు (2) ||ఎంతో|| మేలిమి బంగారు స్థలమందు నిలిపిన (2) చలువ రాతిని బోలు బలమైన పాదాలు (2) మేలిమి బంగారు స్థలమందు నిలిచినా చలువ రాతిని బోలు బలమైన పాదాలు – (2) ఆ లెబానోను సమారూప వైఖరి ఆ.. ఆ.. (2) బలవంతుడగువాడు బహుప్రియుడాతండు (2) ||ఎంతో|| అతడతికాంక్షానీయుండు తనయుండు (2) అతడే నా ప్రియుడు అతడే నా హితుడు (2) అతడతికాంక్షానీయుండు తనయుండు అతడే నా ప్రియుడు అతడే నా హితుడు – (2) ఆతని నొరతి మధురంబు మధురంబు (2) ఆతని పలు వరుస ముత్యాల సరి వరుస (2) ||ఎంతో|| Entho Sundarudamma Thaanu… Entho Sundarudamma Thaanu Nenentho Murisipoyinaanu (2) ||Entho|| Davalavarnudu Rathna Varnundu Naa Priyudu (2) Avani Padivelandu Athi Sreshtudaathandu (2) Davalavarnudu Rathna Varnundu Naa Priyudu Avani Padivelandu Athi Sreshtudaathandu – (2) Evaru Aayanakilalo Samaroopa Purushundu (2) Avaleelagaa Nathani Gurithimpagalanammaa (2) ||Entho|| Kurulu Nokkulu Kaligi Spura Dhroopiyagu Vibhudu (2) Marulu Manasuna Nimpu Mahaneeyudaathandu (2) Kurulu Nokkulu Kaligi Spura Dhroopiyagu Vibhudu Marulu Manasuna Nimpu Mahaneeyudaathandu – (2) Sirulu Kuripinchenu Vara Deva Thanayundu (2) Virabooyu Paraloka Shaaronu Virajaaji (2) ||Entho|| Paalatho Kadigina Nayanaalu Galavaadu (2) Viluvagu Rathanaala Vale Podigina Kanulu (2) Paalatho Kadigina Nayanaalu Galavaadu Viluvagu Rathanaala Vale Podigina Kanulu – (2) Kalushamu Kadigina Kamalaala Kanudoyi (2) Viluvaina Chooposage Varameri Thanayundu (2) ||Entho|| Melimi Bangaaru Sthalamandu Nilipna (2) Chaluva Raathini Bolu Balamaina Paadaalu (2) Melimi Bangaaru Sthalamandu Nilipna Chaluva Raathini Bolu Balamaina Paadaalu – (2) Aa Lebaanonu Samaroopa Vaikhari (2) Balavanthudaguvaadu Bahupriyudaathandu (2) ||Entho|| Athadathikaankshaaneeyundu Thanayundu (2) Athade Naa Priyudu Athade Naa Hithudu (2) Athadathikaankshaaneeyundu Thanayundu Athade Naa Priyudu Athade Naa Hithudu – (2) Aathani Norathi Madhurambu Madhurambu (2) Aathani Palu Varusa Muthyaala Sari Varusa (2) ||Entho||