ఎంతో సుందరమైనవి - YouWorship
Entho Sundaramainavi
Artist: మేడికాయల సాధువు
Category: Praise & Worship
Song Lyrics
ఎంతో సుందరమైనవి - ధర గిరులపై - నెంతో యందమైనవి = సంత తంబుం బరమ - జనకు ప్రేమను దెల్ప - సంతస మందుచు - సరిగ బ్రకటన జేయ = అంతటను బనిం బూని ప్రభున - త్యంతముగం బ్రక టించి వసుధ న-నంత మగు శుభవార్తం జాటెడు - వింత యగు బోధకుల పాదము ||లెంతో!|| 1. మందమతులగు వారలు - మూర్ధత్వంబు - నొందు నెల్ల జనంబులు = వందుచుం గుందుచు - వన గిరి కందరము - లందు నున్న సకల -మౌ మోటుజన మెరుంగం = పొందుగాం ప్రభు యే సొసంగెడు - సుందరం బగు సత్య వాక్యం - బందుకొని చాటించుచుండెడు - అంద మగు బోధ కుల పాదము||లెంతో|| 2. _మదిలోం ప్రభుని నమ్మిన - పాపుల నెల్లం - తుదిని మోక్ష పదమ్మున = విదితమ్ముగాం జేర్చి - ప్రీతిం జూపున టంచు - ఇదిగో రమ్మని క్రీస్తు - పద సన్నిధిని జేర్చ = సదయులై శుభవార్తమానము = ముదమునను మదిలోన నిడి కొని - పదిలముగం ప్రకటించుచుండెడి - విదితు లగు బోధకుల పాదము ||లెంతో|| ౩. యేసు క్రీస్తు రారాజై - యున్నాండనుచు - భాసురంబుగం దెల్పుచు = వాసిగాం ప్రభు యేసు - వసుధ రక్షకుండనుచు - యీ సువార్తను జాటి యిచట నెమ్మదినొంద = దోసకారి జనంబు లందరి - కీ సుమంగళ వార్తం దెలుపుచు - దోస మంతయు. బాపు మన ప్రభు - యేసుం జూపెడు వారి పాదము ||లెంతో!|| Entho Sundaramainavi - Dhara Girulapai - Nentho Yandamainavi = Santha Thambun Barama - Janaku Premanu Delpa - Santhasa Manduchu - Sariga Brakatana Jeya = Anthatanu Banin Booni Prabhuna - Thyanthamugan Braka Tinchi Vasudha Na-Nantha Magu Shubhavaarthan Jaatedu - Vintha Yagu Bodhakula Paadamu ||Lentho!|| 1. Mandamathulagu Vaaralu - Moordhathvambu - Nondu Nella Janambulu = Vanduchun Gunduchu - Vana Giri Kandaramu - Landu Nunna Sakala -Mau Motujana Merunggan = Pondugaan Prabhu Ye Sosanggedu - Sundaran Bagu Sathya Vaakyan - Bandukoni Chaatinchuchundedu - Anda Magu Bodha Kula Paadamu||Lentho|| 2. _Madilon Prabhuni Nammina - Paapula Nellan - Thudini Moksha Padammuna = Vidithammugaan Jerchi - Preethin Joopuna Tanchu - Idigo Rammani Kreesthu - Pada Sannidhini Jercha = Sadayulai Shubhavaarthamaanamu = Mudamunanu Madilona Nidi Koni - Padilamugan Prakatinchuchundedi - Vidithu Lagu Bodhakula Paadamu ||Lentho|| 3. Yesu Kreesthu Raaraajai - Yunnaandanuchu - Bhaasurambugan Delpuchu = Vaasigaan Prabhu Yesu - Vasudha Rakshakundanuchu - Yee Suvaarthanu Jaati Yichata Nemmadinonda = Dosakaari Janambu Landari - Kee Sumanggala Vaarthan Delupuchu - Dosa Manthayu. Baapu Mana Prabhu - Yesun Joopedu Vaari Paadamu ||Lentho!||