ఎంతో రమ్యంబైనది - YouWorship
Entho Ramyambainadi
Artist: ఎం. ఆనందము
Category: Praise
Song Lyrics
ఎంతో రమ్యంబైనది భూతలమందు - ఎంతో మాన్యంబైనది = చెంత జేరి యేసు వింత పాదాబ్దముల - సంతసంబున పూజసల్లు క్రైస్తవ గృహము ఎంతో 1. పిల్ల మొక్కలై - బల్లల చుట్టు - ఎల్లప్పుడు ఆడుచున్ = నుల్లమందున యేసు చల్లని వాక్యంబున్ - నెల్ల వేళల దలచి నుండుచుండెడి గృహము 2. _ తల్లిదండ్రు లైక్యత - దనరుచునుండి - దాక్షిణ్య నిధుల జిల్కి = ఎల్లప్రేమామృత మెల్ల వారల కొసగి - కల్లోలములు వీడి - నుల్లసిల్లెడి గృహము ||ఎంతో|| 3. _ పొరుగువారల మైత్రిని - పొందుగ గోరి - పొలుపారు నీతిన్ దనరు = నురుతరనాత్మ వరముల పైని గురిపించు- వరదాత యేసున్ - ప్రార్థించు గృహము ||ఎంతో|| 4. _శోధనల నన్నింటిని సర్వదా - శోభిల్లు విశ్వాసమున్ - మోద మొందగ యేసునాధు నందున నిల్పి సాదరంబుగ సాక్ష్యమిడెడు క్రైస్తవ గృహము || ఎంతో 5. వ్యర్థ ఖర్చుల మానుచు- వర్ధిల్లు కొలది సర్దుకొని జీవించుచున్ = వృద్ధి నొందెడు వేళ శ్రద్ధాభక్తులతో డా - ఇద్ధరిత్రిని దచశమభాగ మొసగెడు గృపము ఎంతో! Entho Ramyambainadi Bhoothalamandu - Entho Maanyambainadi = Chentha Jeri Yesu Vintha Paadaabdamula - Santhasambuna Poojasallu Kraisthava Gruhamu Entho 1. Pilla Mokkalai - Ballala Chuttu - Ellappudu Aaduchun = Nullamanduna Yesu Challani Vaakyambun - Nella Velala Dalachi Nunduchundedi Gruhamu 2. _ Thallidandru Laikyatha - Danaruchunundi - Daakshinya Nidhula Jilki = Ellapremaamrutha Mella Vaarala Kosagi - Kallolamulu Veedi - Nullasilledi Gruhamu ||Entho|| 3. _ Poruguvaarala Maithrini - Ponduga Gori - Polupaaru Neethin Danaru = Nurutharanaathma Varamula Paini Guripinchu- Varadaatha Yesun - Praarthinchu Gruhamu ||Entho|| 4. _Shodhanala Nannintini Sarvadaa - Shobhillu Vishvaasamun - Moda Mondaga Yesunaadhu Nanduna Nilpi Saadarambuga Saakshyamidedu Kraisthava Gruhamu || Entho 5. Vyartha Kharchula Maanuchu- Vardhillu Koladi Sardukoni Jeevinchuchun = Vruddhi Nondedu Vela Shraddhaabhakthulatho Daa - Iddharithrini Dachashamabhaaga Mosagedu Grupamu Entho!