ఎంతో దుఃఖముం బొందితివా - YouWorship
Entho Duhkhamun Bondithivaa
Artist: బూదాల లైమన్
Category: Good Friday
Song Lyrics
ఎంతో దుఃఖముం బొందితివా - నాకొర కెంతో - దుఃఖము పొంది తివా = యెంతో దుఃఖము నీకు - ఎంతో చింతయు నీకు - ఎంతో దిగులయ్యా నాకు - ఆ - పొంతి పిలాతు యూ - దులు నీకుం బెట్టిన - శ్రమలను దలపోయం గా ||నెంతో|| 1... వచ్చిరి యూదులు - ముచ్చట లాడుచు - నెచ్చట వాండనుచు = నిన్ను - మచ్చరముతో వారి - యిచ్చ వచ్చినట్లు - కొట్టి దూషించినారా యెంతో! 2... సుందరమగు దేహ - మందున దెబ్బలు - గ్రంధులు గట్టినవా = నీవు - పొందిన బాధ నా - డెందము తలంపనా - నందములే దాయెను ఎంతో! 8. _ కొట్టుకొట్టుమని - తిట్టికేల్ దట్టిని - న్నట్టిట్టు నెట్టచును = వారు - పెట్టుశ్రమలు తుద - మట్టున కోర్చియుం - బెట్టితివా ప్రాణము ||నెంతో|| 4. నెపముం బెట్టుచుం దిట్టి - యపహసించుచు యూద - చపలులు గొట్టి నారా = నా - యపరాధములకు నా - పదలను బొంది నీ - కృప నాకుం జూపినావా ||యెంతో|| 5. _ చక్కని నా యేసు - మిక్కిలి బాధ నీ - కెక్కువ గలిగె నయ్యా = ఆహా - యొక్క దుష్టుండీటె - ప్రక్కను గ్రుచ్చి తన - యక్కస దీర్చుకొనెనా|| యెంతో! 6. _ అన్నదమ్ములైన - అక్క సెల్లెం డైనం - కన్న పిత్రాదు లైన = నన్ను - ఎన్నం డైనం బ్రేమించలే రైరి నా - యన్నా ప్రేమించినావా ||యెంతో|| Entho Duhkhamun Bondithivaa - Naakora Kentho - Duhkhamu Pondi Thivaa = Yentho Duhkhamu Neeku - Entho Chinthayu Neeku - Entho Digulayyaa Naaku - Aa - Ponthi Pilaathu Yoo - Dulu Neekun Bettina - Shramalanu Dalapoyan Gaa ||Nentho|| 1... Vachchiri Yoodulu - Muchchata Laaduchu - Nechchata Vaandanuchu = Ninnu - Machcharamutho Vaari - Yichcha Vachchinatlu - Kotti Dooshinchinaaraa Yentho! 2... Sundaramagu Deha - Manduna Debbalu - Grandhulu Gattinavaa = Neevu - Pondina Baadha Naa - Dendamu Thalampanaa - Nandamule Daayenu Entho! 8. _ Kottukottumani - Thittikel Dattini - Nnattittu Nettachunu = Vaaru - Pettushramalu Thuda - Mattuna Korchiyun - Bettithivaa Praanamu ||Nentho|| 4. Nepamun Bettuchun Ditti - Yapahasinchuchu Yooda - Chapalulu Gotti Naaraa = Naa - Yaparaadhamulaku Naa - Padalanu Bondi Nee - Krupa Naakun Joopinaavaa ||Yentho|| 5. _ Chakkani Naa Yesu - Mikkili Baadha Nee - Kekkuva Galige Nayyaa = Aahaa - Yokka Dushtundeete - Prakkanu Gruchchi Thana - Yakkasa Deerchukonenaa|| Yentho! 6. _ Annadammulaina - Akka Sellen Dainan - Kanna Pithraadu Laina = Nannu - Ennan Dainan Breminchale Rairi Naa - Yannaa Preminchinaavaa ||Yentho||