ఎంతో ఘనమగువారలు - YouWorship
Entho Ghanamaguvaaralu
Artist: ఐనన్ జోసఫ్
Category: Praise
Song Lyrics
ఎంతో ఘనమగువారలు - పరిశుద్ధులు - ఎంతో వినదగువారలు = సంతసంబుగ వార -త్యంత ప్రేరణతోడ - సొంతవారిని సహా - సొంతంబుగ విడచి = చెంతజేరిరి యేసు ప్రభుని - చింతలేకను వెంబడించి - వింత పనులను జేసి బ్రతికిరి - అంతమువరకును నడచిరి ఎంతో! 1... పేతు రపోస్తలుండు - అతని సోదరు - ప్రియు డందైయయు = నీతి నియమములందు - బ్రదుకుచు - చేతి పనులయందు - శ్రద్ధతో నుండుచు = ఖ్యాతి నొందిన యోహాను - అతని యన్న యాకోబుతోను - ప్రతి దినంబును కలిసి యుండుచు - భక్తి ప్రభువును వెంబడించిరి | ఎంతో! సర్వపరిశుద్దుల స్మరణ 453 2. నిచ్చిన - ఆస్తిపరుడ - పోసలులతో = స్వస్థబుద్ధి తోడ - ఆస్తివాడుట యెట్లో - క్రీస్తు సేవకొరకు - ఖర్చుపెట్టుట యెట్లో = వాస్తవముగ - ఆస్తిగలవారలకు నెల్ల - ప్రస్తుతంపు ఆస్తిపాస్తులు - ప్రభువు పనికియ్యవలెనని || ఎంతో! 3. సంఘమును హింసించిన - సంఘాభిమాని - సంఘ నాయకుడు పౌలు = సంఘముల నెన్నిటినో - చక్కగను స్థాపించి - సంఘముల కుత్తరముల్ - సమయానుకులముగ = సంఘ కాపరులకును సహా - సరియగు సలహాల నిచ్చి- సంఘములను ప్రభువు కొరకై స్థాపించి నిలుపలేదా |||| ఎంతో! 4. కన్యయైన మరియమ్మ - ధన్యురాలు - కన్యలకు తల్లులకున్ను = అన్యులకు అందరికి - ఆదర్శముగ నుండ - సన్యాసిను లెందరో -స్వామిని సేవించ = కన్యకలుగ నిలుచువారలు - కఠినవ్రతములతోడ నుండి - ధన్యులగు పరిశుద్ధులతో - దైవసన్నిధి నుండ జూపెను || ఎంతో! 5. మగదాలయూరి మరియ - మహినినున్న - మగువలలో కెల్లను = భగవంతుడై నట్టి - ప్రభువు యేసునుజేరి - నగము నెక్కెను తన - సొగసైన మార్పుచే = సాగి మొదట సమాధికడకు - స్వామిదర్శనమొంది మొదట- వేగవెళ్లి శిష్యులకును - వెదకి సాక్ష్యమియ్యలేదా ||||ఎంతో|| 6. మత్తయి మార్కులను వారు - మతమునందు - అతినిష్టగలవారలు = మత్తయి యూదులకై తన పుస్తకమును వ్రాసె - మార్కు గూడను తన సు-వార్తనందరి కిచ్చె = వాస్తవంపు జీవితమును - వరుసగాను గలిగియుండ - క్రీస్తు ప్రభువును వెంబడించగ - క్రొత్తలోకము జూపగలిగిరి ఎంతో! 7. _చూచననేగాని- నమ్మనని - పేచిపెట్టి నతోమయు = చాచి చేయి చూచి చక్కగ నమ్మెను - చూడకుండనె లూక - వైద్యుండు నమ్మెను = యీ చొప్పున వీరలిద్దరు - నీచజనులకెల్లరకు తము - బ్రోచు ప్రభువును జూపుచుందురు - ట్రోదిగా ప్రతిదినమునందును || ఎంతో! 8. ప్రభువా నీ పరిశుద్ధుల - బ్రతుకునందు - మా భాగ్యమునున్నదిహా = ప్రభువా వారి బ్రదుకు - ప్రబలమైన సేవ - విభవంగాగని - విజయంబు గాంచుచు = సభను యే రాణింపజేసి - సఫలముగ సేవించి బ్రతికి - వారితో నేలునట్లు - యభయమియ్యు మాకు దేవా ఎంతో! Entho Ghanamaguvaaralu - Parishuddhulu - Entho Vinadaguvaaralu = Santhasambuga Vaara -Thyantha Preranathoda - Sonthavaarini Sahaa - Sonthambuga Vidachi = Chenthajeriri Yesu Prabhuni - Chinthalekanu Vembadinchi - Vintha Panulanu Jesi Brathikiri - Anthamuvarakunu Nadachiri Entho! 1... Pethu Raposthalundu - Athani Sodaru - Priyu Dandaiyayu = Neethi Niyamamulandu - Bradukuchu - Chethi Panulayandu - Shraddhatho Nunduchu = Khyaathi Nondina Yohaanu - Athani Yanna Yaakobuthonu - Prathi Dinambunu Kalisi Yunduchu - Bhakthi Prabhuvunu Vembadinchiri | Entho! Sarvaparishuddula Smarana 453 2. Nichchina - Aasthiparuda - Posalulatho = Svasthabuddhi Thoda - Aasthivaaduta Yetlo - Kreesthu Sevakoraku - Kharchupettuta Yetlo = Vaasthavamuga - Aasthigalavaaralaku Nella - Prasthuthampu Aasthipaasthulu - Prabhuvu Panikiyyavalenani || Entho! 3. Sangghamunu Hinsinchina - Sangghaabhimaani - Sanggha Naayakudu Paulu = Sangghamula Nennitino - Chakkaganu Sthaapinchi - Sangghamula Kuththaramul - Samayaanukulamuga = Sanggha Kaaparulakunu Sahaa - Sariyagu Salahaala Nichchi- Sangghamulanu Prabhuvu Korakai Sthaapinchi Nilupaledaa |||| Entho! 4. Kanyayaina Mariyamma - Dhanyuraalu - Kanyalaku Thallulakunnu = Anyulaku Andariki - Aadarshamuga Nunda - Sanyaasinu Lendaro -Svaamini Sevincha = Kanyakaluga Niluchuvaaralu - Kathinavrathamulathoda Nundi - Dhanyulagu Parishuddhulatho - Daivasannidhi Nunda Joopenu || Entho! 5. Magadaalayoori Mariya - Mahininunna - Maguvalalo Kellanu = Bhagavanthudai Natti - Prabhuvu Yesunujeri - Nagamu Nekkenu Thana - Sogasaina Maarpuche = Saagi Modata Samaadhikadaku - Svaamidarshanamondi Modata- Vegavelli Shishyulakunu - Vedaki Saakshyamiyyaledaa ||||Entho|| 6. Maththayi Maarkulanu Vaaru - Mathamunandu - Athinishtagalavaaralu = Maththayi Yoodulakai Thana Pusthakamunu Vraase - Maarku Goodanu Thana Su-Vaarthanandari Kichche = Vaasthavampu Jeevithamunu - Varusagaanu Galigiyunda - Kreesthu Prabhuvunu Vembadinchaga - Kroththalokamu Joopagaligiri Entho! 7. _Choochananegaani- Nammanani - Pechipetti Nathomayu = Chaachi Cheyi Choochi Chakkaga Nammenu - Choodakundane Looka - Vaidyundu Nammenu = Yee Choppuna Veeraliddaru - Neechajanulakellaraku Thamu - Brochu Prabhuvunu Joopuchunduru - Trodigaa Prathidinamunandunu || Entho! 8. Prabhuvaa Nee Parishuddhula - Brathukunandu - Maa Bhaagyamununnadihaa = Prabhuvaa Vaari Braduku - Prabalamaina Seva - Vibhavanggaagani - Vijayambu Gaanchuchu = Sabhanu Ye Raanimpajesi - Saphalamuga Sevinchi Brathiki - Vaaritho Nelunatlu - Yabhayamiyyu Maaku Devaa Entho!