ఎంతెంత భారమాయె - YouWorship
Enthentha Bhaaramaaye Aa Siluva
Artist: సాయరాం గట్టు
Category: Worship
Song Lyrics
ఎంతెంత భారమాయె ఆ సిలువ లోక పాపములన్ని నువ్వు గెలువ (2) కదిలినావు ఆ కల్వరికి మరణముని దరి చేర్చుకొని (2) యేసయ్యా… నా యేసయ్యా… అలసిపోతివ నా యేసయ్యా… (2) కొరడాలు నీ ఒళ్ళు చీల్చేను పిడి గుద్దులతో కళ్ళు తిరిగెను (2) వడి ముళ్ళు తలలోన నాటేను నీ కళ్ళు రుధిరాన్ని కురిసెను (2) ||యేసయ్యా|| బరువైన సిలువను మోయలేక తడబడె నీ అడుగు అదిరిపడి (2) వడివడిగా నిన్ను నడువుమని పడి పడి తన్నిరి ఆ పాపులు (2) ||యేసయ్యా|| చల్లని నీ దేహమల్లాడెను ఏ చోటు లేకుండ గాయాలతో (2) కాళ్ళు చేతులకు దిగి మేకులు వ్రేళాడే సిలువకు నీ ప్రాణము (2) ||యేసయ్యా|| వెలలేనిది తండ్రి నీ త్యాగము నీ కష్టమంతయు నా పాపము (2) మదిలోన కొలువుండు నా రక్షకా వదిలేది లేదు నిన్ను నా పాలిక (2) ||యేసయ్యా|| Enthentha Bhaaramaaye Aa Siluva Loka Paapamulanni Nuvvu Geluva (2) Kadilinaavu Aa Kalvariki Maranamuni Dari Cherchukoni (2) Yesayyaa… Naa Yesayyaa… Alasipothiva Naa Yesayyaa… (2) Koradaalu Nee Ollu Cheelchenu Pidi Guddulatho Kallu Thirigenu (2) Vadi Mullu Thalalona Naatenu Nee Kallu Rudhiraanni Kurisenu (2) ||Yesayyaa|| Baruvaina Siluvanu Moyaleka Thadabade Nee Adugu Adiripadi (2) Vadivadiga Ninnu Naduvumani Padi Padi Thanniri Aa Paapulu (2) ||Yesayyaa|| Challani Nee Dehamallaadenu Ae Chotu Lekunda Gaayaalatho (2) Kaallu Chethulaku Digi Mekulu Vrelaade Siluvaku Nee Praanamu (2) ||Yesayyaa|| Velalenidi Thandri Nee Thyaagamu Nee Kashtamanthayu Naa Paapamu (2) Madilona Koluvundu Naa Rakshakaa Vadiledi Ledu Ninnu Naa Paalika (2) ||Yesayyaa||