ఎంతదూరము మోయించెదరు స్వామి - YouWorship
Enthadooramu Moyinchedaru Svaami
Artist: Unknown Artist
Category: Worship
Song Lyrics
ప|| ఎంతదూరము మోయించెదరు స్వామి కింత సిలువనెత్తి నుంతైన దయేలక ||ఎంత|| 1. ఒంటిగా ప్రార్థించి యుపవాసములు జేసి కంటి నిదురలేక కలతజెందిన ప్రభుని ||ఎంత|| 2. సొమ్మునాశించి గురున్ అమ్ముకొన్న యూద నమ్మించి మీకిచ్చె నిమ్మానుయేలును ||ఎంత|| 3. కరములు జోడించి కడకు గేత్సెమనిలో పరమ తండ్రిని వేడు నిరపరాదిని పట్టి ||వెంత|| 4. పిరికి పిలాతుని బెదరించి యదలించి యెరుషాలేం వీధుల నేసుని ద్రిప్పుచు ||ఎంత|| 5. ఒడలలసి నా ప్రభువు తడబడుచుండగా ఘడియ ఘడియకు తిట్టి గట్టిగ కొట్టుచు ||వంత|| 6. కలువరి గిరివరకు సిలువ మోయలేక అలసిన ప్రభుజంప నాలస్యమును చేసి ||ఎంత|| 7. యేసు నీకొరకై నే నేడ్చుటకంటెను దోషినని గ్రహించి దోసిలొగ్గుటె మేలు ||వంత|| Pa|| Enthadooramu Moyinchedaru Svaami Kintha Siluvaneththi Nunthaina Dayelaka ||Entha|| 1. Ontigaa Praarthinchi Yupavaasamulu Jesi Kanti Niduraleka Kalathajendina Prabhuni ||Entha|| 2. Sommunaashinchi Gurun Ammukonna Yooda Namminchi Meekichche Nimmaanuyelunu ||Entha|| 3. Karamulu Jodinchi Kadaku Gethsemanilo Parama Thandrini Vedu Niraparaadini Patti ||Ventha|| 4. Piriki Pilaathuni Bedarinchi Yadalinchi Yerushaalen Veedhula Nesuni Drippuchu ||Entha|| 5. Odalalasi Naa Prabhuvu Thadabaduchundagaa Ghadiya Ghadiyaku Thitti Gattiga Kottuchu ||Vantha|| 6. Kaluvari Girivaraku Siluva Moyaleka Alasina Prabhujampa Naalasyamunu Chesi ||Entha|| 7. Yesu Neekorakai Ne Nedchutakantenu Doshinani Grahinchi Dosiloggute Melu ||Vantha||