ఎంతటి వాడను నేను - YouWorship
Enthati Vaadanu Nenu
Artist: ఏ ఆర్ స్టీవెన్సన్
Category: Praise
Song Lyrics
ఎంతటి వాడను నేను యేసయ్యా కొంతైనా యోగ్యుడను కానయ్యా (2) ఇంతగ నను హెచ్చించుటకు ఈ స్థితిలో నన్నుంచుటకు (2) ||ఎంతటి|| ఐశ్వర్యము గొప్పతనమును కలిగించు దేవుడవీవే హెచ్చించువాడవును బలమిచ్చువాడవు నీవే (2) అల్పుడను మంటి పురుగును నన్ను ప్రేమించినావు ప్రాణమును నీ సర్వమును నా కొరకై అర్పించినావు ||ఎంతటి|| నిను వెంబడించువారిని నిజముగ సేవించువారిని నీవుండే స్థలములలో నిలిచే నీ సేవకుని (2) ఎంతో ఘనపరచెదవు ఆశీర్వదించెదవు శత్రువుల కంటె ఎత్తుగా అతని తలను పైకెత్తెదవు ||ఎంతటి|| వినయముగల మనుష్యులను వర్దిల్లజేసెదవు గర్విష్టుల గర్వమునణచి గద్దె నుండి దించెదవు (2) మాదు ఆశ్రయ దుర్గమా మేమంతా నీ వారమే మా శైలము మా కేడెమా మాకున్నదంతా నీ దానమే ||ఎంతటి|| Enthati Vaadanu Nenu Yesayyaa Konthainaa Yogyudanu Kaanayyaa (2) Inthaga Nanu Hechchinchutaku Ee Sthithilo Nannunchutaku (2) ||Enthati|| Aishwaryamu Goppathanamunu Kaliginchu Devudaveeve Hechchinchuvaadavunu Balamichchuvaadavu Neeve (2) Alpudanu Manti Purugunu Nannu Preminchinaavu Praanamunu Nee Sarvamunu Naa Korakai Arpinchinaavu ||Enthati|| Ninu Vembadinchuvaarini Nijamuga Sevinchuvaarini Neevunde Sthalamulalo Niliche Nee Sevakuni (2) Entho Ghanaparachedavu Aasheervadinchedavu Shathruvula Kante Eththugaa Athani Thalanu Paikeththedavu ||Enthati|| Vinayamugala Manushyulanu Vardhillajesedavu Garvishtula Garvamunanachi Gadde Nundi Dinchedavu (2) Maadu Aashraya Durgamaa Memanthaa Nee Vaarame Maa Shailamu Maa Kedemaa Maakunnadantha Nee Daaname ||Enthati||