ఊహకు అందని కార్యముల్ - YouWorship
Oohaku Andani Kaaryamul
Artist: సామి పచిగళ్ల
Category: Praise
Song Lyrics
ఊహకు అందని కార్యముల్ ఊహించని రీతిలో నాకై చేసిన దేవా ఊహకు అందని వేళలో ఊహించని మేలులన్ నాకై చేసిన దేవా ఉత్సహించి పాడెదన్ ఉల్లసించి చాటెదన్ నీదు నామ గీతము నాదు జీవితాంతము కొనియాడెదన్ కీర్తించెదన్ స్తోత్రించెదన్ ||ఊహకు|| కనబడవు మా కళ్ళకు – మరి వినబడవు మా చెవులకు ఊహలకే అస్సలందవు – ప్రభు నీ కార్యముల్ (2) అడుగువాటి కంటెను – ఊహించు వాటి కంటెను అద్భుతాలు చేయగా – వేరెవరికింత సాధ్యము అసాధ్యమైనదేది నీకు లేనే లేదు ఇల నీకు మించి నాకు దైవమెవరున్నారు (2) ||ఉత్సహించి|| బండ నుండి నీళ్లను – ఉబికింపజేసినావుగా ఎడారిలో జల ధారలు – ప్రవహింపజేసినావుగా కనుపాప లాగ నన్ను కాచే దైవం నీవు నడి సంద్రమైన నన్ను నడిపే తోడే నీవు (2) ||ఉత్సహించి|| Oohaku Andani Kaaryamul Oohinchani Reethilo Naakai Chesina Devaa Oohaku Andani Velalo Oohinchani Melulan Naakai Chesina Devaa Uthsahinchi Paadedan Ullasinchi Chaatedan Needu Naama Geethamu Naadu Jeevithaanthamu Koniyaadedan Keerthinchedan Sthothrinchedan ||Oohaku|| Kanabadavu Maa Kallaku – Mari Vinabadavu Maa Chevulaku Oohalake Assalandavu – Prabhu Nee Kaaryamul (2) Aduguvaati Kantenu – Oohinchu Vaati Kantenu Adbhuthaalu Cheyagaa – Verevarikintha Saadhyamu Asaadhyamainadedi Neeku Lene Ledu Ila Neeku Minchi Naaku Daivamevarunnaaru (2) ||Uthsahinchi|| Banda Nundi Neellanu – Ubikimpajesinaavugaa Edaarilo Jala Dhaaralu – Pravahimpajesinaavugaa Kanupaapa Laaga Nannu Kaache Daivam Neevu Nadi Sandramaina Nannu Nadipe Thode Neevu (2) ||Uthsahinchi||