ఉన్నపాటున వచ్చుచున్నాను - YouWorship
Unnapaatuna Vachchu
Artist: పురుషోత్తము చౌదరి
Category: Worship
Song Lyrics
ఉన్నపాటున వచ్చు-చున్నాను నీ పాద సన్నిధి-కో రక్షకా ఎన్న శక్యము గాని పాపము-లన్ని మోపుగ వీపు పైబడి యున్న విదె నడలేక తొట్రిలు-చున్నవాడను నన్ను దయగను ||ఉన్న|| కారుణ్య నిధి యేసు – నా రక్షకా నీ శ-రీర రక్తము చిందుట భూరి దయతో నన్ను నీ దరి – జేర రమ్మని పిలుచుటయు ని ష్కారణపు నీ ప్రేమ యిది మరి – వేరే హేతువు లేదు నా యెడ ||ఉన్న|| మసి బొగ్గు వలె నా మా-నస మెల్ల గప్పె దో-ష సమూహములు మచ్చలై అసిత మగు ప్రతి డాగు తుడువను – గసుటు గడిగి పవిత్ర పరపను అసువు లిడు నీ రక్తమే యని – మాసల కిప్పుడు సిలువ నిదె గని ||ఉన్న|| వెలుపట బహు యుద్ధ-ములు లోపటను భయము – కలిగె నెమ్మది దొలాగెను పలు విధములగు సందియంబుల – వలన పోరాటములచే నే నలసి యిటునటు గొట్టబడి దు-ర్బలుడనై గాయములతో నిదె ||ఉన్న|| కడు బీద వాడ నం-ధుడను దౌర్భాగ్యుడను చెడిపోయి పడియున్నాను సుడివడిన నా మదికి స్వస్థత – చెడిన కనులకు దృష్టి భాగ్యము బడయ వలసిన వన్ని నీ చే – బడయుటకు నా యొడ యడా యిదె ||ఉన్న|| నీ వాగ్దత్తము నమ్మి – నీపై భారము పెట్టి – జీవ మార్గము గంటిని కేవలంబగు ప్రేమ చేతను – నీవు నన్ను క్షమించి చేకొని భావ శుద్ధి నొనర్చి సంతో-షావసరముల నిడుదువని యిదె ||ఉన్న|| దరిలేని యానంద-కరమైన నీ ప్రేమ – తరమే వర్ణన చేయను తెరవు కడ్డం బైన యన్నిటి – విరుగ గొట్టెను గాన నే నిపు డరుదుగా నీ వాడ నవుటకు – మరి నిజము నీ వాడ నవుటకే ||ఉన్న|| Unnapaatuna Vachchu-chunnaanu Nee Paada – Sannidhiko Rakshakaa Yenna Shakyamu Gaani Paapamu-lanni Mopuga Veepu Paibadi Yunna Vide Nadaleka Thotrilu-chunnavaadanu nannu Dayaganu ||Unna|| Kaarunya Nidhi Yesu – Naa Rakshakaa Nee Sha-reera Rakthamu Chinduta Bhoori Dayatho Nannu Nee Dari – Jera Rammani Piluchutayu Ni Shkaaranapu Nee Prema Yidi Mari – Vere Hethuvu Ledu Naa Yeda ||Unna|| Masi Boggu Vale Naa Maa-nasa Mella Gappe Do-sha Samoohamulu Machchalai Asitha Magu Prathi Daagu Thuduvanu – Gasutu Gadigi Pavithra Parapanu Asuvu Lidu Nee Rakthame Yani – Masala Kippudu Siluva Nide Gani ||Unna|| Velupata Bahu Yuddha-mulu Lopatanu Bhayamu – Kalige Nemmadi Dolagenu Palu Vidhamulagu Sandiyambula – Valana Poraatamulache Ne Nalasi Yitunatu Gottabadi Du-rbhaludanai Gaayamulatho Nide ||Unna|| Kadu Beeda Vaada Na-ndhudanu Dourbhaagyudanu – Chedipoyi Padiyunnaanu Sudivadina Naa Madiki Swasthatha – Chedina Kanulaku Drushti Bhaagyamu Badaya Valasina Vanni Nee Che – Badayutaku Naa Yoda Yadaa Yide ||Unna|| Nee Vaagdhatthamu Nammi Neepai Bhaaramu Petti – Jeeva Maargamu Gantini Kevalambagu Prema Chethanu – Neevu Nannu Kshaminchi Chekoni Bhaava Shuddhi Nonarchi Santho-shaavasaramula Nidudhuvani Yide ||Unna|| Darileni Yaananda-karamaina Nee Prema – Tharame Varnana Cheyanu Theravu Kadda Baina Yanniti – Viruga Gottenu Gaana Ne Nipu Darudugaa Nee Vaada Navutaku – Mari Nijamu Nee Vaada Navutake ||Unna||