ఉదయ సాయంత్రముల నెల్లవేళల ప్రభువా - YouWorship
Udaya Saayanthramula Nellavelala Prabhuvaa
Artist: సీయోను గీతాలు
Category: Worship
Song Lyrics
పల్లవి: ఉదయ సాయంత్రముల నెల్లవేళల ప్రభువా - నే ధ్యానించి పాడెదన్ (2) పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధునిదని దూతలు - పాడుట వినబడుచుంచున్ (2) 1. యెహోవాయే నాకు వెలుగు రక్షణయు- నేనెవరికి వెరతును (2) యెహోవాయే నా ప్రాణ దుర్గంబాయె - శత్రువులు తొట్రిల్లిరి (2) 2. యుద్ధము చేయుటకు దండు దిగినను - నా హృదయము భయపడదు యుద్ధము రేగినను దీనియందు నే - ధైర్యము విడువకుందున్ 3. యెహోవా యొద్ద వరమొక్కటడిగితిని - దానిని వెదకు చున్నాను యెహోవా ప్రసన్నత జూచి ఆలయమున - ధ్యానించుటయే నా ఆశ 4. తన పర్ణశాలలో నను జేర్చి కాచును - నా ఆపత్కాలమునందు తన గుడారములోన నను దాచియుంచును - దుర్గముపై నెక్కించున్ 5. నా సన్నిధి వెదకి నా స్వరము వినుమని - నీవు పల్కితివి గాన నీ సన్నిధిని వెదకి నీ స్వరమే వినెదను - నీ సముఖమును దాచకు 6. నా తల్లిదండ్రులు నన్ను విడచినను - యెహోవాయే చేరదీయున్ నే ధైర్యము కలిగి నిబ్బరముగ నుండెద - నీ కొరకు కనిపెట్టెదన్ 7. యెహోవా నాకై యుద్దేశించినది - ఆయనయే నెరవేర్చును మహోన్నతుని మాటకు భయపడెడి పరిశుద్ధుల - కోరికలు నెరవేర్చును Pallavi: Udaya Saayanthramula Nellavelala Prabhuvaa - Ne Dhyaaninchi Paadedan (2) Parishuddhadu Parishuddhadu Parishuddhanidani Doothalu - Paaduta Vinabaduchunchun (2) 1. Yehovaaye Naaku Velugu Rakshanayu- Nenevariki Verathunu (2) Yehovaaye Naa Praana Durgambaaye - Shathruvulu Thotrilliri (2) 2. Yuddhamu Cheyutaku Dandu Diginanu - Naa Hrudayamu Bhayapadadu Yuddhamu Reginanu Deeniyandu Ne - Dhairyamu Viduvakundun 3. Yehovaa Yodda Varamokkatadigithini - Daanini Vedaku Chunnaanu Yehovaa Prasannatha Joochi Aalayamuna - Dhyaaninchutaye Naa Aasha 4. Thana Parnashaalalo Nanu Jerchi Kaachunu - Naa Aapathkaalamunandu Thana Gudaaramulona Nanu Daachiyunchunu - Durgamupai Nekkinchun 5. Naa Sannidhi Vedaki Naa Svaramu Vinumani - Neevu Palkithivi Gaana Nee Sannidhini Vedaki Nee Svarame Vinedanu - Nee Samukhamunu Daachaku 6. Naa Thallidandrulu Nannu Vidachinanu - Yehovaaye Cheradeeyun Ne Dhairyamu Kaligi Nibbaramuga Nundeda - Nee Koraku Kanipettedan 7. Yehovaa Naakai Yuddeshinchinadi - Aayanaye Neraverchunu Mahonnathuni Maataku Bhayapadedi Parishuddhala - Korikalu Neraverchunu