ఉదయమాయె హృదయమా - YouWorship
Udayamaaye Hrudayamaa
Artist: ఎన్ సంజయ్
Category: Worship
Song Lyrics
ఉదయమాయె హృదయమా ప్రభు యేసుని ప్రార్ధించవే (2) పదిలముగా నిను వదలకుండా పడక నుండి లేపెనే (2) ||ఉదయమాయె|| రాత్రి గడచిపోయెనే రవి తూర్పున తెలవారెనే (2) రాజా రక్షకుడేసు దేవుని మహిమతో వివరించవే (2) ||ఉదయమాయె|| తొలుత పక్షులు లేచెనే తమ గూటి నుండి స్తుతించెనే (2) తండ్రి నీవే దిక్కు మాకని ఆకాశమునకు ఎగిరెనే (2) ||ఉదయమాయె|| పరిశుద్ధుడా పావనుండా పరంధాముడా చిరంజీవుడా (2) పగటియంతయు కాచి మము పరిపాలించుము దేవుడా (2) ||ఉదయమాయె|| తండ్రి దాతవు నీవని ధరయందు దిక్కు ఎవరని (2) రాక వరకు కరుణ చూపి కనికరించి బ్రోవుమా (2) ||ఉదయమాయె|| Udayamaaye Hrudayamaa Prabhu Yesuni Praardhinchave (2) Padilamugaa Ninu Vadalakundaa Padaka Nundi Lepene (2) ||Udayamaaye|| Raathri Gadachipoyene Ravi Thoorpuna Thelavaarene (2) Raaja Rakshakudesu Devuni Mahimatho Vivarinchave (2) ||Udayamaaye|| Tholutha Pakshulu Lechene Thama Gooti Nundi Sthuthinchene (2) Thandri Neeve Dikku Maakani Aakashamunaku Egirene (2) ||Udayamaaye|| Parishuddhudaa Paavanundaa Parandhaamudaa Chiranjeevudaa (2) Pagati Yanthayu Kaachi Mamu Paripaalinchumu Devudaa (2) ||Udayamaaye|| Thandri Daathavu Neevani Dharayandu Dikku Evarani (2) Raaka Varaku Karuna Choopi Kanikarinchi Brovumaa (2) ||Udayamaaye||