ఉతక మీద తలుపు - YouWorship
Uthaka Meeda Thalupu
Artist: Unknown Artist
Category: Encouraging
Song Lyrics
ఉతక మీద తలుపు తిరుగు రీతిగా తన పడక మీద సోమరి తిరుగాడును గానుగ చుట్టెద్దు తిరుగు రీతిగా సోమరి చుట్టూ లేమి తిరుగును సోమరీ మేలుకో… వేకువనే లేచి ప్రార్ధించుకో.. (2) జ్ఞానముతో నీ బ్రతుకును మార్చుకో ప్రభు యేసుని నీ మదిలో చేర్చుకో (2) ||ఉతక|| చిన్న జీవులు చీమలు చూడు వాటికి ఏలిక లేనే లేదు (2) అయినను అవి క్రమము గానే నడచును వేసవిలో ఆహారము కూర్చును (2) ||సోమరీ|| చిన్న కుందేళ్ళను చూడు ఏ మాత్రము బలము లేని జీవులు (2) పేరు సందులలో జీవించును బంధకములు లేనివై తిరుగును (2) ||సోమరీ|| చిన్న జీవులు మిడతలు చూడు వాటికి న్యాయాధిపతి లేడుగా (2) పంక్తులుగా తీరి సాగి పోవును జ్ఞానము గల వానిగ పేరొందును (2) ||సోమరీ|| తెల్లవారుచుండగనే పక్షులు కిలకిలమని దేవుని స్తుతియించును (2) బ్రతుకు తెరువు కోసమై తిరుగును ప్రొద్దుగూకు వేళలో గూడు చేరును (2) ||సోమరీ|| ఓ మానవుడా నీ మనసును మార్చుకో ఎందుకో నీ పయనము తెలుసుకో (2) ప్రభు రాకడ ఎప్పుడో అది తెలియదు అంతమొచ్చుఁ కాలమొక్కటున్నది (2) ||సోమరీ|| Uthaka Meeda Thalupu Thirugu Reethigaa Thana Padaka Meeda Somari Thirigaadunu Gaanuga Chutteddu Thirugu Reethigaa Somari Chuttu Lemi Thirugunu Somaree Meluko.. Vekuvane Lechi Praardhinchuko.. (2) Gnaanamutho Nee Brathukunu Maarchuko Prabhu Yesuni Nee Madilo Cherchuko (2) ||Uthaka|| Chinna Jeevulu Cheemalu Choodu Vaatiki Elika Lene Ledu (2) Ainanu Avi Kramamu Gaane Nadachunu Vesavilo Aahaaramu Koorchunu (2) ||Somaree|| Chinna Kundellanu Choodu Ae Maathramu Balamu Leni Jeevulu (2) Petu Sandulalo Jeevinchunu Bandhakamulu Lenivai Thirugunu (2) ||Somaree|| Chinna Jeevulu Midathalu Choodu Vaatiki Nyaaydhipathi Ledugaa (2) Pankthulugaa Theeri Saagi Povunu Gnaanamu Gala Vaaniga Perondunu (2) ||Somaree|| Thellavaaruchundagane Pakshulu Kilakilamani Devuni Sthuthiyinchunu (2) Brathuku Theruvu Kosamai Thirugunu Proddugooku Velalo Goodu Cherunu (2) ||Somaree|| O Maanavudaa Nee Manasunu Maarchuko Enduko Nee Payanamu Thelusuko (2) Prabhu Raakada Eppudo Adi Theliyadu Anthamochchu Kaalamokkatunnadi (2) ||Somaree||