ఈ భువిపై పరలోక వింతైన జనమా - YouWorship
Ee Bhuvipai Paraloka Vinthaina Janamaa
Artist: సీయోను గీతాలు
Category: Encouraging
Song Lyrics
పల్లవి: ఈ భువిపై పరలోక వింతైన జనమా ప్రభుయేసు క్రీస్తువులో తన పరిశుద్దులకు జయమిచ్చు దేవునికి స్తోత్రములు 1. ప్రభులో మీ ప్రయాసం వ్యర్ధం కాదు - ప్రభు పనిలో యెరిగి ఎదుగుచును స్ధిరులై ఆసక్తితో సాగుడి 2. నూతన సృష్టినాశించు మీరు -శుద్ధ ప్రవర్తనన్ ప్రభు దృష్టికి అగుపడజాగ్రత్తగా నడువుమా 3. క్రీస్తుప్రభుని ప్రత్యక్షమందు - నిరపరాధులుగా నిలబడును మీరు శాంతితో నడుపునంతమువరకు 4. దోషిని నీవు గత దుష్ప్రక్రియలతో - నిర్దోషిగా ప్రభుసన్నిధి నిలువబెట్ట ప్రాణమిచ్చి సమాధాన పరచె 5. క్రీస్తేసు బండపై కట్టబడియ- సువార్త సత్య నిరీక్షణలు విడువక విశ్వాసముతో నిలువుడి 6. సత్కార్యములన్నిటను సఫలులగుచు - సంతోషింప ప్రభుస్వరములో తండ్రితో నడువు తగినట్లుగా 7. దైవాత్మ సుతులు దేవుని వారసులు - నిలువ శ్రమలలో క్రీస్తు వారసులు మహిమపొందగా యేసుతో మహిమలో Pallavi: Ee Bhuvipai Paraloka Vinthaina Janamaa PrabhuYesu Kreesthuvulo Thana Parishuddulaku Jayamichchu Devuniki Sthothramulu 1. Prabhulo Mee Prayaasan Vyardhan Kaadu - Prabhu Panilo Yerigi Eduguchunu Sdhirulai Aasakthitho Saagudi 2. Noothana Srushtinaashinchu Meeru -Shuddha Pravarthanan Prabhu Drushtiki Agupadajaagraththagaa Naduvumaa 3. KreesthuPrabhuni Prathyakshamandu - Niraparaadhulugaa Nilabadunu Meeru Shaanthitho Nadupunanthamuvaraku 4. Doshini Neevu Gatha Dushprakriyalatho - Nirdoshigaa Prabhusannidhi Niluvabetta Praanamichchi Samaadhaana Parache 5. Kreesthesu Bandapai Kattabadiya- Suvaartha Sathya Nireekshanalu Viduvaka Vishvaasamutho Niluvudi 6. Sathkaaryamulannitanu Saphalulaguchu - Santhoshimpa Prabhusvaramulo Thandritho Naduvu Thaginatlugaa 7. Daivaathma Suthulu Devuni Vaarasulu - Niluva Shramalalo Kreesthu Vaarasulu Mahimapondagaa Yesutho Mahimalo