ఈ ఉదయం శుభ ఉదయం - YouWorship
Ee Udayam Shubha Udayam
Artist: అనిల్ కుమార్ వేముల
Category: Worship
Song Lyrics
ఈ ఉదయం – శుభ ఉదయం ప్రభువే నాకొసగిన – ఆనంద సమయం ఆశ్రయించెదన్ – దివ్య వాక్యమున్ ప్రేమతోడ సరిచేసే – శ్రేష్ఠ సత్యమున్ ||ఈ ఉదయం|| బలహీనమైతి నేను – బలపరచుము తండ్రి ఫలహీనమైతి నేను – ఫలియింపజేయుము వాక్య ధ్యానమే – నీ ముఖ దర్శనము పరిశుద్ధ పరచెడి – పరమతండ్రి మార్గము ||ఈ ఉదయం|| అస్థిరమునైతి నేను – స్థిరపరచుము తండ్రి అల్పవిశ్వాసి నేను – అద్దరికి జేర్చుము నీ పాదసన్నిధే – నాకు శరణము అభయంబునిచ్చెడి – ఆశ్రయపురము ||ఈ ఉదయం|| Ee Udayam – Shubha Udayam Prabhuve Naakosagina – Aananda Samayam Aashrayinchedan – Divya Vaakyamun Premathoda Sari Chesi – Sreshta Sathyamun ||Ee Udayam|| Balaheenamaithi Nenu – Balaparchumu Thandri Phalaheenamaithi Nenu – Phaliyimpajeyumu Vaakya Dhyaaname – Nee Mukha Darshanamu Parishuddha Parachedi – Parama Thandri Maargamu ||Ee Udayam|| Asthiramunaithi Nenu – Sthiraparachumu Thandri Alpa Vishwaasi Nenu – Addariki Jerchumu Nee Paada Sannidhe – Naaku Sharanmu Abhayambunichchedi – Aashrayapuramu ||Ee Udayam||