ఇరువది నలుగురు పెద్దలతో - YouWorship
Iruvadi Naluguru Peddalatho
Artist: జాన్ ప్రసాద రావు సిరివెళ్ల
Category: Praise
Song Lyrics
ఇరువది నలుగురు పెద్దలతో పరిశుద్ధ దూతల సమూహముతో (2) నాలుగు జీవుల గానముతో (2) స్తుతియింపబడుచున్న మా దేవా ||ఇరువది|| భూమ్యాకాశములన్నియును పర్వత సముద్ర జల చరముల్ (2) ఆకాశ పక్షులు అనుదినము (2) గానము చేయుచు స్తుతియింపన్ ||ఇరువది|| కరుణారసమగు హృదయుడవు పరిశుద్ధ దేవ తనయుడవు (2) మనుజుల రక్షణ కారకుడా (2) మహిమ కలిగిన మా ప్రభువా ||ఇరువది|| గుప్పిలి విప్పి కూర్మితోను గొప్పగ దీవెనలిచ్చెదవు (2) గొర్రెల కాపరి దావీదు (2) అయ్యెను ఎంతో మహారాజు ||ఇరువది|| Iruvadi Naluguru Peddalatho Parishuddha Doothala Samoohamutho (2) Naalugu Jeevula Gaanamutho (2) Sthuthiyimpabaduchunna Maa Devaa ||Iruvadi|| Bhoomyaakaashamulanniyunu Parvatha Samudra Jala Charamul (2) Aakaasha Pakshulu Anudinamu (2) Gaanamu Cheyuchu Sthuthiyimpan ||Iruvadi|| Karunaarasamagu Hrudayudavu Parishuddha Deva Thanayudavu (2) Manujula Rakshana Kaarakudaa (2) Mahima Kaligina Maa Prabhuvaa ||Iruvadi|| Guppili Vippi Koormithonu Goppaga Deevenalichchedavu (2) Gorrela Kaapari Daaveedu (2) Ayyenu Entho Mahaaraaju ||Iruvadi||