ఇయ్యుడి మాకియ్యబడునని - YouWorship
Iyyudi Maakiyyabadunani
Artist: జీజాన్ తాతయ్య
Category: Praise & Worship
Song Lyrics
ఇయ్యుడి మాకియ్యబడునని - ఇయ్యగల శ్రీ యేసు ప్రభువు = నెయ్యముతో తన - శిష్యవితతికి - నయముమోర జెప్పినట్లు ఇయ్యుడి|| 1. మొదట పరముని నంతునియ్యరే - సదమల హృదయంబుతోడ = సదయు డగు మన పరమతండ్రి - ముదమతోడ నంతయు నిచ్చున్ || ఇయ్యుడి|| 2. శక్తికొలది నియ్యవలెనని - భక్తులందరితోడ జెప్పె = ప్రభుని సేవకు- శక్తికొలది నియవలెను ||ఇయ్యుడి|| 3. _కొంచెముగ విత్తెడివారు - కొంచెము సమకూర్చెదరు = హెచ్చువిత్తెడి వారికిలను - హెచ్చు ఫలములు నిండుగ దొరుకున్ || ఇయ్యుడి|| 4, సంతసంబుతో నిచ్చెడివారి నెంతో దేవుడు కృపతో బ్రోచున్ = వింతగా దీవెనలతోడ - అంతయు దయచేసి బ్రోచున్ ||ఇయ్యుడి|| 5. యేసు కృపను ఎరిగిమనుడి - యేసు మార్గమునందు నడువుడి= దాసుడై ధనమంత - నీచులకొరకిలను మున్నె ఇయ్యుడి|| 6. పరమనిధులను నింపుకొనుడి - పరమ దేవుని ప్రేమను గనుడి = పరమ నిధులలో చిమ్మెటుండదు - దొంగలసలే లేరుసుమండి || ఇయ్యుడి|| Iyyudi Maakiyyabadunani - Iyyagala Shree Yesu Prabhuvu = Neyyamutho Thana - Shishyavithathiki - Nayamumora Jeppinatlu Iyyudi|| 1. Modata Paramuni Nanthuniyyare - Sadamala Hrudayambuthoda = Sadayu Dagu Mana Paramathandri - Mudamathoda Nanthayu Nichchun || Iyyudi|| 2. Shakthikoladi Niyyavalenani - Bhakthulandarithoda Jeppe = Prabhuni Sevaku- Shakthikoladi Niyavalenu ||Iyyudi|| 3. _Konchemuga Viththedivaaru - Konchemu Samakoorchedaru = Hechchuviththedi Vaarikilanu - Hechchu Phalamulu Ninduga Dorukun || Iyyudi|| 4, Santhasambutho Nichchedivaari Nentho Devudu Krupatho Brochun = Vinthagaa Deevenalathoda - Anthayu Dayachesi Brochun ||Iyyudi|| 5. Yesu Krupanu Erigimanudi - Yesu Maargamunandu Naduvudi= Daasudai Dhanamantha - Neechulakorakilanu Munne Iyyudi|| 6. Paramanidhulanu Nimpukonudi - Parama Devuni Premanu Ganudi = Parama Nidhulalo Chimmetundadu - Donggalasale Lerusumandi || Iyyudi||