ఇమ్ముగ నడిపించితివి నెమ్మదిగల - YouWorship
Immuga Nadipinchithivi Nemmadigala
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: ఇమ్ముగనడిపించితివి నెమ్మదిగల ఈ స్థలమునకు ప్రభు ఇమ్ముగనడిపించితివి (1) 1. మా కున్నస్థలము ఇరుకనియు నీకు మొరలిడగా (2) మరియొకస్థలము మాకొసగితివి (2) - నీకృపకై స్తుతులు (2) 2. బలపరచి మరిధైర్యము నిచ్చి అభయము నిచ్చితివి ఇల నీ మందిరమును నిర్మింప - జనులను కూర్చితివి 3. ప్రభువా నీకై నిర్మింపబడిన నీ మందిర ఘనత సకల దేశ నివాసులయందు - భాసిల్ల గోరితిని 4. మీ మధ్యలో నాఆత్మ యున్నదని సెలవిచ్చిన యేసు ప్రభువా మాకు తోడైయుండి - పనిజరిగించితివి 5. పుష్కలమై బహుజలమయమైన తావుకు తెచ్చితివి ఎష్కోలు ద్రాక్షాఫలములుగ - ఫలియింప గోరితివి 6. అన్యజనులు బహు ఆశ్చర్యపడిరి నీ ఘన కార్యముకై గుర్తించిరిగా నీ అద్భుతములు - దేవా స్తోత్రములు 7. వెండి బంగారము లన్నియు నీవి దండిగ నిచ్చెదవు మెండుగ నీదు మేలుల కొరకై - హల్లెలూయ పాడెదము Pallavi: Immuganadipinchithivi Nemmadigala Ee Sthalamunaku Prabhu Immuganadipinchithivi (1) 1. Maa Kunnasthalamu Irukaniyu Neeku Moralidagaa (2) Mariyokasthalamu Maakosagithivi (2) - NeeKrupakai Sthuthulu (2) 2. Balaparachi Maridhairyamu Nichchi Abhayamu Nichchithivi Ila Nee Mandiramunu Nirmimpa - Janulanu Koorchithivi 3. Prabhuvaa Neekai Nirmimpabadina Nee Mandira Ghanatha Sakala Desha Nivaasulayandu - Bhaasilla Gorithini 4. Mee Madhyalo NaaAathma Yunnadani Selavichchina Yesu Prabhuvaa Maaku Thodaiyundi - Panijariginchithivi 5. Pushkalamai Bahujalamayamaina Thaavuku Thechchithivi Eshkolu Draakshaaphalamuluga - Phaliyimpa Gorithivi 6. Anyajanulu Bahu Aashcharyapadiri Nee Ghana Kaaryamukai Gurthinchirigaa Nee Adbhuthamulu - Devaa Sthothramulu 7. Vendi Banggaaramu Lanniyu Neevi Dandiga Nichchedavu Menduga Needu Melula Korakai - Hallelooya Paadedamu