ఇద్దరొక్కటిగ మారేటి - YouWorship
Iddarokkatiga Maareti
Artist: సాయరాం గట్టు
Category: Marriage
Song Lyrics
ఇద్దరొక్కటిగ మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్య అనుబంధము (2) వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి (2) ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి (2) హవ్వను చేసి జతపరచి – ఫలించమని దీవించెను సృష్టిపైన అధికారముతో – పాలించుమని నియమించెను (2) ||వివాహమన్నది|| ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి (2) సొంత తెలివిని మానుకొని – దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం – దేవుని కొరకై ప్రతి క్షణం (2) ||వివాహమన్నది|| భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ (2) క్రీస్తు ప్రేమను పంచాలి – సాక్ష్యములను చాటించాలి సంతానమును పొందుకొని – తండ్రి రాజ్యముకు చేర్చాలి (2) ||వివాహమన్నది|| Iddarokkatiga Maareti Madhuramaina Kshanamu Devuni Chitthamulo Penavesina Nithya Anubandhamu (2) Vivaahamannadi Anninta Ghanamainadi Aadaamu Havvalatho Modalaindi Aa Sandadi (2) Ontaraina Aadaamunu Choosi Janta Kaavaalani Madi Thalachi (2) Havvanu Chesi Jathaparachi – Phalinchamani Deevinchenu Srushtipaina Adhikaaramutho – Paalinchumani Niyaminchenu (2) ||Vivaahamannadi|| Eka Manasutho Munduku Saagi Jeeva Vrukshamuku Maargamu Erigi (2) Sontha Thelivini Maanukoni – Daiva Vaakkupai Aanukoni Saagipovaali Aa Payanam – Devuni Korakai Prathi Kshanam (2) ||Vivaahamannadi|| Bhaarya Bharthalu Samaanamantu Okari Kosamu Okaranukuntu (2) Kreesthu Premanu Panchaali – Saakshyamulanu Chaatinchaali Santhaanamunu Pondukoni – Thandri Raajyamuku Cherchaali (2) ||Vivaahamannadi||