ఇదిగో నేనొక నూతన క్రియను - YouWorship
Idigo Nenoka Noothana Kriyanu
Artist: Unknown Artist
Category: Worship
Song Lyrics
ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను (2) ఈనాడే అది మొలచును దాని నాలోచింపరా (2) ||ఇదిగో|| అడవిలో త్రోవనుజేసి – ఎడారిలో నదులను నేను (2) ఎల్లప్పుడు సమృద్ధిగా – ప్రవహింప జేసెదను (2) ||ఇదిగో|| నాదు ప్రజలు త్రాగుటకు – నేనరణ్యములో నదులు (2) సమృద్ధిగా పారునట్లు – సృష్టించెదను నేను (2) ||ఇదిగో|| అరణ్యములో జంతువులు – క్రూరపక్షులు సర్పములు (2) ఘనపరచును స్తుతియించును – దీని నాలోచించుడి (2) ||ఇదిగో|| నూతన సృష్టిగ నినుజేసి – నీ శాంతిని నదివలెజేసి (2) ననుజూచి మహిమపరచి – స్తుతిబాడ జేసెదను (2) ||ఇదిగో|| నేనే దేవుడనని దెలసి – నా కార్యములను నెరవేర్చి (2) ముందున్న వాటికన్న – ఘనకార్యములను జేతున్ (2) ||ఇదిగో|| మరుగైన మన్నానిచ్చి – మరితెల్లని రాతినిచ్చి (2) చెక్కెదనా రాతిమీద – నొక క్రొత్త నామమును (2) ||ఇదిగో|| పరలోక భాగ్యంబులు – నరలోకములో మనకొసగెన్ (2) కరుణాసంపన్నుడగు – మన ప్రభువునకు హల్లెలూయ (2) ||ఇదిగో|| Idigo Nenuoka Noothana Kriyanu Cheyuchunnanu (2) Eenaade Adi Molachunu Daani Naalochimparaa (2) ||Idigo|| Adavilo Throvanujesi – Edaarilo Nadulanu Nenu (2) Ellappudu Samruddhigaa – Pravahimpa Jesedanu (2) ||Idigo|| Naadu Prajalu Thraagutaku – Nenaranyamulo Nadulu (2) Samruddhigaa Paarunatlu – Srushtinchedanu Nenu (2) ||Idigo|| Aranyamulo Janthuvulu – Kroorapakshulu Sarpamulu (2) Ghanaparachunu Stuthiyinchunu – Dini Naalochinchudi (2) ||Idigo|| Noothana Srushtiga Ninu Jesi – Nee Shaanthini Nadivale Jesi (2) Nanu Joochi Mahimaparachi – Sthuthi Baada Jesedanu (2) ||Idigo|| Nene Devudanani Delasi – Naa Kaaryamulanu Neraverchi (2) Mundunna Vaatikanna – Ghanakaryamulanu Jethun (2) ||Idigo|| Marugaina Mannaanichchi – Mari Thellani Raathinichchi (2) Chekkedanaa Raathimeeda – Noka Krottha Naamamunu (2) ||Idigo|| Paraloka Bhaagyambulu – Naralokamulo Manakosagen (2) Karunaasampannudagu – Mana Prabhuvunaku Halleluya (2) ||Idigo||