ఇదిగో నీతిభాస్కరుండు - YouWorship
Idigo Neethibhaaskarundu
Artist: చెట్టి భానుమూర్తి
Category: Praise
Song Lyrics
ఇదిగో నీతిభాస్కరుండు - ఉదయమాయె నతని నీతి హృదయ కమలమునను నిలిచి మది తమోగుణంబులణపె - సదమల జ్ఞానంబు నొసగె ||ఇదిగో|| 1. ఎవని జ్ఞానమహిమ విభవ - మెవనినీతి బలప్రకాశ మెవని మనుజ రూపమాయె - నవవినీత సత్యవర్తి రవినిమించు తేజమూర్తి ||ఇదిగో|| 2. నరజనముల నీతియెవడో - ధరణిపతుల దీప్తియెవడో దురితబుణము దీర్చునెవండో - పరమపురుషు డేసుడతండె నిరతజీవ మొసగునిపుడె ||ఇదిగో|| 3. కలుష మెల్ల బాపదలంచి - కలువరి గిరివరకు నడచి యలవికాని ముక్తి గూర్చన్ - సిలువమిద గని మరణ బలమునణలచి తిరిగిలేచె ||ఇదిగో|| 4. మదితమం బదెచటికరిగె - యెదను కఠినతనము కరిగె హృదయరసము లతిశయించి - సాధుగుణముగలిగి యేసు పాదములను గొలుతు నిపుడె ||ఇదిగో|| 5. జనగణముల జీవమతండె - ధనఘనముల దాతయతండె యనుభవమున నెణుంగుమతని - యనుపమ ప్రేమామృతంబు ననవరతానందకరము ||ఇదిగో|| Idigo Neethibhaaskarundu - Udayamaaye Nathani Neethi Hrudaya Kamalamunanu Nilichi Madi Thamogunambulanape - Sadamala Gnaanambu Nosage ||Idigo|| 1. Evani Gnaanamahima Vibhava - Mevanineethi Balaprakaasha Mevani Manuja Roopamaaye - Navavineetha Sathyavarthi Raviniminchu Thejamoorthi ||Idigo|| 2. Narajanamula Neethiyevado - Dharanipathula Deepthiyevado Durithabunamu Deerchunevando - Paramapurushu Desudathande Nirathajeeva Mosagunipude ||Idigo|| 3. Kalusha Mella Baapadalanchi - Kaluvari Girivaraku Nadachi Yalavikaani Mukthi Goorchan - Siluvamida Gani Marana Balamunanalachi Thirigileche ||Idigo|| 4. Madithamam Badechatikarige - Yedanu Kathinathanamu Karige Hrudayarasamu Lathishayinchi - Saadhugunamugaligi Yesu Paadamulanu Goluthu Nipude ||Idigo|| 5. Janaganamula Jeevamathande - Dhanaghanamula Daathayathande Yanubhavamuna Nenungumathani - Yanupama Premaamruthambu Nanavarathaanandakaramu ||Idigo||