ఇదిగో దేవా నా జీవితం - YouWorship
Idigo Deva Naa Jeevitham
Artist: వై బాబ్జి
Category: Worship
Song Lyrics
ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం (2) శరణం నీ చరణం (4) ||ఇదిగో|| పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనమునుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి (2) అయినా నీ ప్రేమతో నన్ను దరిచేర్చినావు అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం ||ఇదిగో|| నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగ నేర్పు నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పనిచేయనిమ్ము (2) ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పనిచేయనిమ్ము ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము ||ఇదిగో|| విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు (2) క్షేమ క్షామ కాలమైనా నిన్ను ఘనపరచు బతుకునిమ్మయ్యా నశియించే ఆత్మలన్ నీ దరి చేర్చు కృపనిమ్మయ్యా ||ఇదిగో|| Idigo Devaa Naa Jeevitham Aapaadamasthakam Neekankitham (2) Sharanam Nee Charanam (4) ||Idigo|| Palumaarlu Vaidolaginaanu Paraloka Darshanamunundi Viluvaina Nee Divya Pilupuku Ne Thaginatlu Jeevinchanaithi (2) Ainaa Nee Prematho Nannu Dari Cherchinaavu Anduke Gaikonumu Devaa Ee Naa Shesha Jeevitham ||Idigo|| Nee Paadamula Chentha Cheri Nee Chiththambu Neneruga Nerpu Nee Hrudaya Bhaarambu Nosagi Praardhinchi Panicheyanimmu (2) Aagipoka Saagipovu Priyasuthuniga Panicheyanimmu Prathi Chota Nee Saakshigaa Prabhuvaa Nannundanimmu ||Idigo|| Visthaara Panta Polamu Nundi Kashtinchi Pani Cheya Nerpu Kanneetitho Vitthu Manasu Kalakaalam Mari Naaku Nosagu (2) Kshema Kshaama Kaalamainaa Ninnu Ghanaparachu Bathukunimmayyaa Nashiyinche Aathmalan Nee Dari Cherchu Krupanimmayyaa ||Idigo||