ఇదిగో ఈ మనుష్యుడు - YouWorship
Idigo Ee Manushyudu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: ఇదిగో ఈ మనుష్యుడు - దేవుని కుమారుడు పరము నుండి ధరణికి - నరుడై అరుదెంచిన పరిశుద్ధ దేవుడు - హల్లెలూయ - శ్రీయేసునాధుడు 1. ఆద్యంత రహితుడు అల్ఫా ..... ఓమేగా తానే ఆదిసంభూతుడు - అసమానుండైన క్రీస్తు - సర్వలోకమునకై గొర్రెపిల్లగ బలియై - మృతుల నుండి లేచిన సజీవుడు 2. భూమ్యాకాశముల కర్త - భూజనుల రక్షణకర్త సర్వసృష్టి కర్త - సమాధాన కర్త - పాపవిముక్తికై - రక్తము చిందింప అభిషిక్తుడైన క్రీస్తేసుడు 3. ఈ ప్రభువే స్తోత్రార్హుడు - ఆరాధనకు పాత్రుడు రాజుల రాజు యేసు - ఎబినేజరై యున్నాడు నజరేయుండగు యేసు - విజయుండైలేచెను నిజరక్షకుండని భజియింతుము 4. తండ్రి మహిమను విడచెను - మరణ పధమున నడిచెను శ్రీమంతుడైన ప్రభువు - మనకై దరిద్రుడాయెన్ మారుమనస్సు పొంద - కనికరమున మన్నించి నీతిగతీర్చిన ప్రేమామయుడు 5. రారాజై రానున్నాడు - యుగయుగముల రాజ్యమేలన్ న్యాయాధిపతిగ వచ్చున్ - అందరికీ తీర్పు తీర్చన్ ఇహపరములకు - ఘనతమహిమలకు ప్రభువుల ప్రభువనుచు ప్రణుతింతుము Pallavi: Idigo Ee Manushyudu - Devuni Kumaarudu Paramu Nundi Dharaniki - Narudai Arudenchina Parishuddha Devudu - Hallelooya - ShreeYesunaadhudu 1. Aadyantha Rahithudu Alphaa ..... Omegaa Thaane Aadisambhoothudu - Asamaanundaina Kreesthu - Sarvalokamunakai Gorrepillaga Baliyai - Mruthula Nundi Lechina Sajeevudu 2. Bhoomyaakaashamula Kartha - Bhoojanula Rakshanakartha Sarvasrushti Kartha - Samaadhaana Kartha - Paapavimukthikai - Rakthamu Chindimpa Abhishikthudaina Kreesthesudu 3. Ee Prabhuve Sthothraarhudu - Aaraadhanaku Paathrudu Raajula Raaju Yesu - Ebinejarai Yunnaadu Najareyundagu Yesu - Vijayundailechenu Nijarakshakundani Bhajiyinthumu 4. Thandri Mahimanu Vidachenu - Marana Padhamuna Nadichenu Shreemanthudaina Prabhuvu - Manakai Daridrudaayen Maarumanassu Ponda - Kanikaramuna Manninchi Neethigatheerchina Premaamayudu 5. Raaraajai Raanunnaadu - Yugayugamula Raajyamelan Nyaayaadhipathiga Vachchun - Andarikee Theerpu Theerchan Ihaparamulaku - Ghanathamahimalaku Prabhuvula Prabhuvanuchu Pranuthinthumu