ఇంతలోనే కనబడి - YouWorship
Inthalone Kanabadi
Artist: జాన్ వెస్లీ
Category: Encouraging
Song Lyrics
ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దానికా ఆరాటం త్రాసు మీద ధూళివంటి ఎత్తలేని నీటివంటి స్వల్పమైనదానికా పోరాటం కాదు కాదు శాశ్వతం ఏది కాదు నీ సొంతం దాటిపోవును ఇల నీ సంపదలన్నియు (2) ||ఇంతలోనే|| బంగారు కాసులున్నా అపరంజి మేడలున్నా అంతరించిపోయెను భువినేలిన రాజులు (2) నాది నాది నాదియంటూ విర్రవీగుచున్నావా చచ్చినాక నీది అన్న దేహమైన వచ్చునా ||ఇంతలోనే|| మోయలేక బ్రతుకు భారం మూర్చబోయిరెందరో ఎదలోని ఆక్రందనలు మారుమ్రోగే లోకంలో (2) ఆశ్రయించు యేసుని అనుకూల సమయమున చేర్చు నిన్ను మోక్షరాజ్యం నడుపు నిన్ను శాంతితో ||ఇంతలోనే|| Inthalone Kanabadi – Anthalone Maayamayye Alpamaina Daanikaa Aaraatam Thraasu Meeda Dhoolivanti – Eththaleni Neetivanti Swalpamainadaanikaa Poraatam Kaadu Kaadu Shaashwatham Edi Kaadu Nee Sontham Daatipovunu Ila Nee Sampadalanniyu (2) ||Inthalone|| Bangaaru Kaasulunnaa Aparanji Medalunna Antharinchipoyenu Bhuvinelina Raajulu (2) Naadi Naadi Naadiyantoo Virraveeguchunnaavaa Chachchinaaka Needi Anna Dehamaina Vachchunaa ||Inthalone|| Moyaleka Brathuku Bhaaram Moorchaboyirendaro Edaloni Aakrandanalu Maarumroge Lokamlo (2) Aashrayinchu Yesuni Anukoola Samayamuna Cherchu Ninnu Moksharaajyam Nadupu Ninnu Shaanthitho ||Inthalone||