ఆశీర్వాదము నీయుమ - YouWorship
Aasheervaadamu Neeyuma
Artist: Unknown Artist
Category: Prayer
Song Lyrics
ఆశీర్వాదము నీయుమ - మా పరమజనక - యాశీర్వాదము నీయుమ = ఆశలుదీరంగ - నాయు వొసంగుచు - వాసిగ కరుణను - వర్ధిల్ల బిడ్డకు |||| ఆశీర్వాదము|| 1. యేసు పెరిగిన యట్టులే - నీ దయయందు - ఈసు బిడ్డను పెంచుము = వాసిగ మనుజుల కరుణయందున బెరుగ - భాసుర వరమిచ్చి - బాగుగ బెంచుము || ఆశీర్వాదము|| 2. నెనరు మరగ మోషేను -నెమ్మదియందు - తనర బెంచినట్లుగ =ఘనముగ నీ శాంతి - సంతసములయందు - తనర నీ బిడ్డను - తగురీతి బెంచుము |||| ఆశీర్వాదము|| 3. ఏ రీతి సమూయేలును - నీ సన్నిధిలో -నేపుగ బెంచితివో = యారీతి నీ బిడ్డ నాత్మ స్నేహమునందు - కోరి బెంచుము ప్రభువ - కోర్కెలూరగ వేగ |||| ఆశీర్వాదము|| 4 సత్య విశ్వాసమునందు - చక్కగ బెరుగ - శక్తి యొసంగినడ్పుమా = సత్య వాక్యమునందు - సరగను - నిత్యము నీ కృప - నిచ్చి బ్రోవుమ ప్రభువ |||| ఆశీర్వాదము|| 5. భక్తి ప్రేమల నీ బిడ్డ - బాగుగా బెరుగ - శక్తినీయ మా ప్రభువ = ముక్తి పథంబున ముద్దుగ నడువంగ - యుక్తజ్ఞానము నిచ్చి - యుద్ధరించుమ ప్రభువ |||| ఆశీర్వాదము|| -తూలూరి వ్రకాశము Aasheervaadamu Neeyuma - Maa Paramajanaka - Yaasheervaadamu Neeyuma = Aashaludeerangga - Naayu Vosangguchu - Vaasiga Karunanu - Vardhilla Biddaku |||| Aasheervaadamu|| 1. Yesu Perigina Yattule - Nee Dayayandu - Eesu Biddanu Penchumu = Vaasiga Manujula Karunayanduna Beruga - Bhaasura Varamichchi - Baaguga Benchumu || Aasheervaadamu|| 2. Nenaru Maraga Moshenu -Nemmadiyandu - Thanara Benchinatluga =Ghanamuga Nee Shaanthi - Santhasamulayandu - Thanara Nee Biddanu - Thagureethi Benchumu |||| Aasheervaadamu|| 3. E Reethi Samooyelunu - Nee Sannidhilo -Nepuga Benchithivo = Yaareethi Nee Bidda Naathma Snehamunandu - Kori Benchumu Prabhuva - Korkelooraga Vega |||| Aasheervaadamu|| 4 Sathya Vishvaasamunandu - Chakkaga Beruga - Shakthi Yosangginadpumaa = Sathya Vaakyamunandu - Saraganu - Nithyamu Nee Krupa - Nichchi Brovuma Prabhuva |||| Aasheervaadamu|| 5. Bhakthi Premala Nee Bidda - Baagugaa Beruga - Shakthineeya Maa Prabhuva = Mukthi Pathambuna Mudduga Naduvangga - Yukthajnyaanamu Nichchi - Yuddharinchuma Prabhuva |||| Aasheervaadamu|| -Thooloori Vrakaashamu