ఆశలన్ని - YouWorship
Aashalanni
Artist: గిఫ్ట్సన్ దురై
Category: Encouraging
Song Lyrics
నే తెరచు తలుపులు అన్ని, తరచుగా మూసితివి కోపించి పగనుంచినా నవ్వుతూ చూసితివి నే తలచు మార్గములన్ని తరచుగా మూసితివి కన్నీళ్లతో దుఃఖించినా కౌగిలిలో దాచితివి మూయుటకు కారణం ఈ మూర్ఖునికి తెలిసినదే అడిగిన దానికంటే అధికమే పొందితినే మూయుటకు కారణం ఇప్పుడే తెలిసినదే అడిగిన దానికంటే ఎక్కువే పొందితినే నా చిన్న చిన్న ఆశలన్ని ఎరిగితివి కోరికలన్ని తీర్చితివి మూర్ఖునని నీవెరిగినా కౌగిలిలో బంధించితివి ఆశలన్ని ఎరిగితివి కోరికలన్ని తీర్చితివి మూఢుడై నేనుండగా ఎత్తుకుని నడిపించితివి తండ్రులెవరైననూ చేపనడిగితే పామునిచ్చునా తండ్రీ నిన్ను నీ దయ మాత్రమే వేడితిని నీకు వేరుగా నేను ఏదియు కోరలేను ఆశలే నా ఊసై తాకనీ జనుల మనసును తప్పుగా అడగను నీ చిత్తమే కోరెదను జీవముకు అర్ధము నీ వాక్యమే తెలిపెను మది లోతులన్ని నీవు మాత్రమే ఎరిగితివి కలవరములన్ని నీవే గ్రహియించితివి ఏది ఏమైనగాని నీ సన్నిధి నేను చేరెదను ఎవరి ఎగతాళి మించినా నీ చిత్తమే చేయ సాగెదను ఎవ్వరికి తెలియని సంగతులు ఎరిగితివి లోతైన గాయము నీ ప్రేమతో మాన్పితివి ||నే తెరచు|| Ne Therachu Thalupulu Anni, Tharachugaa Moosithivi Kopinchi Paganunchinaa Navvuthoo Choosithivi Ne Thalachu Maargamulanni Tharachugaa Moosithivi Kanneellatho Duhkhinchinaa Kougililo Daachithivi Mooyutaku Kaaranam Ee Moorkhuniki Thelisinade Adigina Daanikante Adhikame Pondithine Mooyutaku Kaaranam Ippude Thelisinade Adigina Daanikante Ekkuve Pondithine Naa Chinna Chinna Aashalanni Erigithivi Korikalanni Theerchithivi Moorkhunani Neeveriginaa Kougililo Bandhinchitivi Aashalanni Erigithivi Korikalanni Theerchithivi Moodudai Nenundagaa Etthukoni Nadipinchithivi Thandrulevarainanoo Chepanadigithe Paamunichchunaa Thandree Ninnu Nee Daya Maathrame Vedithini Neeku Verugaa Nenu Ediyu Koralenu Aashale Naa Oosai Thaakanee Janula Manasunu Thappugaa Adaganu Nee Chitthame Koredanu Jeevamuku Ardhamu Nee Vaakyame Thelipenu Madi Lothulanni Neevu Maathrame Erigithivi Kalavaramulanni Neeve Grahiyinchitivi Edi Emainagaani Nee Sannidhi Nenu Cheredanu Evari Egathaali Minchinaa Nee Chitthame Cheya Saagedanu Evvariki Theliyani Sangathulu Erigithivi Lothaina Gaayamu Nee Prematho Maanpithivi ||Ne Terachu||