ఆర్భాటముతోను ప్రభావముతోను - YouWorship
Aarbhaatamuthonu Prabhaavamuthonu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: ఆర్భాటముతోను ప్రభావముతోను - మేఘారూడుడై యేసు వేగమే రానుండే అను పల్లవి: మేల్కొనుమా ప్రియ సంఘమా - సిద్ధపడుమా పరిశుద్ధ జనమా (2) 1. పాపముల క్షమియించి శుద్ధి చేసెను - పరలోక పౌరులుగా మనల జేసెను (2) సువార్తను ప్రకటింప ఆజ్ఞ యిచ్చెను - సంఘమును కట్టుమని సెలవిచ్చెను (2) 2. స్థలమును సిద్ధపరచ వెళ్లెను యేసు - తానుండు స్థలములో మనముండునట్లుగా హృదయమును కలవరపడనియ్యకు యేసునియందు విశ్వాసముంచుమా 3. పడిపోయిరి మా బలాఢ్యు లెందరో - ఇశ్రాయేలు నీ సుందర పర్వతముపై మంచైననూ, వానైన కురువదింకనూ పర్వతములన్నియూ పాడైపోయెను 4. యెట్లు వెళ్ళేనో యేసు అట్లే వచ్చును - ప్రతి నేత్రము ఆయనను చూచును భూజనంబులెల్ల రొమ్ము కొట్టుకొందురు - సిగ్గుతో ముఖములెల్ల తెల్లబారును 5. ఆయన ప్రత్యక్షత నపేక్షించుమా - పానార్పణముగా పోయబడుదుమా నిందలను శ్రమలను సహియింతుమా - నీతికిరీటము పొంద పోరాడుదమా Pallavi: Aarbhaatamuthonu Prabhaavamuthonu - Meghaaroodudai Yesu Vegame Raanunde Anu Pallavi: Melkonumaa Priya Sangghamaa - Siddhapadumaa Parishuddha Janamaa (2) 1. Paapamula Kshamiyinchi Shuddhi Chesenu - Paraloka Paurulugaa Manala Jesenu (2) Suvaarthanu Prakatimpa Aagna Yichchenu - Sangghamunu Kattumani Selavichchenu (2) 2. Sthalamunu Siddhaparacha Vellenu Yesu - Thaanundu Sthalamulo Manamundunatlugaa Hrudayamunu Kalavarapadaniyyaku Yesuniyandu Vishvaasamunchumaa 3. Padipoyiri Maa Balaadhyu Lendaro - Ishraayelu Nee Sundara Parvathamupai Manchainanoo, Vaanaina Kuruvadingkanoo Parvathamulanniyoo Paadaipoyenu 4. Yetlu Velleno Yesu Atle Vachchunu - Prathi Nethramu Aayananu Choochunu Bhoojanambulella Rommu Kottukonduru - Siggutho Mukhamulella Thellabaarunu 5. Aayana Prathyakshatha Napekshinchumaa - Paanaarpanamugaa Poyabadudumaa Nindalanu Shramalanu Sahiyinthumaa - Neethikireetamu Ponda Poraadudamaa