ఆరాధనలకు యోగ్యుడవు స్తుతి గీతంబులకు పాత్రుడవు - YouWorship
Aaraadhanalaku Yogyudavu Sthuthi Geethambulaku Paathrudavu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: ఆరాధనలకు యోగ్యుడవు (2) - స్తుతి గీతంబులకు పాత్రుడవు (2) ప్రభు యేసు నిన్ను పూజింతును (2) - మనసార నిన్నే కీర్తింతును (2) ఆరాధనలకు - యోగ్యుడవు (2) 1. భరియించితివి నా రోగములన్ - భరియించితివి నా వ్యసనములన్ (2) అరిగితివి నాకై కలువరికి (2) - పరిహరించితివి పాప శిక్షన్ (2) 2. నా యతిక్రమములకై గాయపడి - నా దోషములకై కొట్టబడి చిందిన సిలువ రక్తములో - నా దారిద్య్రము తొలగించితివి 3. నశియించిన నను వెదకితివి - నశియించిన నను లేపితివి నా శాపమును చూపించితివి - నీ శాంతముతో క్షమించితివి Pallavi: Aaraadhanalaku Yogyudavu (2) - Sthuthi Geethambulaku Paathrudavu (2) Prabhu Yesu Ninnu Poojinthunu (2) - Manasaara Ninne Keerthinthunu (2) Aaraadhanalaku - Yogyudavu (2) 1. Bhariyinchithivi Naa Rogamulan - Bhariyinchithivi Naa Vyasanamulan (2) Arigithivi Naakai Kaluvariki (2) - Pariharinchithivi Paapa Shikshan (2) 2. Naa Yathikramamulakai Gaayapadi - Naa Doshamulakai Kottabadi Chindina Siluva Rakthamulo - Naa Daaridyramu Tholaginchithivi 3. Nashiyinchina Nanu Vedakithivi - Nashiyinchina Nanu Lepithivi Naa Shaapamunu Choopinchithivi - Nee Shaanthamutho Kshaminchithivi