ఆపత్కాలమున - YouWorship
Aapathkaalamuna
Artist: జాన్ ప్రసాద్ & జానకి రావు
Category: Worship
Song Lyrics
ఆపత్కాలమున నాకు ఆశ్రయము నీవే అలసిన క్షణములలో నాకు ఆదరణ నీవే (2) తల్లి కన్నా తండ్రి కన్నా కాచిన దేవా నీకే స్తోత్రం (2) ||ఆపత్కాలమున|| నీవు నన్ను పరిశోధించి పరిశీలించావు నేను లేచి కూర్చుండుటను సమస్తమెరిగితివి (2) ఆకాశమునకు ఎక్కిననూ అక్కడ నీవే ఉన్నావు భూదిగంతములు చుట్టిననూ అక్కడ నీవే ఉన్నావు ఈ విశ్వమంత నీవే మమ్మేలుచున్నావు నీ కన్న దైవమెవరు మా పూజ్యనీయుడా ||ఆపత్కాలమున|| నేను నడచే మార్గమంతటిలో నీ దూతల చేత రాయి తగులక ఎత్తుకొనుమని ఆజ్ఞ ఇచ్చితివి (2) మరణముగుండా వెళ్లిననూ విష సర్పములను తొక్కిననూ చేయి విడువక ఎప్పుడునూ విడనాడక నను ఎన్నడునూ నడిపించుచున్న దేవా నీకెంత ప్రేమ నాపై – (2) ||ఆపత్కాలమున|| Aapathkaalamuna Naaku Aashrayamu Neeve Alasina Kshanamulalo Naaku Aadarana Neeve (2) Thalli Kannaa Thandri Kannaa Kaachina Devaa Neeke Sthothram (2) ||Aapathkaalamuna|| Neevu Nannu Parishodhinchi Parisheelinchaavu Nenu Lechi Kurchundutanu Samasthamerigithivi (2) Aakaashamunaku Ekkinanu Akkada Neeve Unnaavu Boodiganthamulu Chuttinanu Akkada Neeve Unnaavu Ee Vishwamantha Neeve Mammeluchunnaavu Nee Kanna Daivamevaru Maa Poojyaneeyudaa ||Aapathkaalamuna|| Nenu Nadache Maargamanthatilo Nee Doothala Chetha Raayi Thagulaka Etthukonumani Aagna Ichchithivi (2) Maranamugundaa Vellinanu Visha Sarpamulanu Thokkinanu Cheyi Vuduvaka Eppudunu Vidanaadaka Nanu Ennadunu Nadipinchuchunna Devaa Neekentha Prema Naapai – (2) ||Aapathkaalamuna||