ఆనంద మగు ముక్తి - YouWorship
Aananda Magu Mukthi
Artist: పురుషోత్తము చౌదరి
Category: Worship
Song Lyrics
ఆనంద మగు ముక్తి - యే నా మందిరము = జ్ఞాని మానుగం జూచు - దాని సుందరము ॥ఆనందమగు॥ 1. పరదేశివలె దేహా - వరణమం దుందున్ - ధరణి కాననముగా - దర్శించు చుందున్ - నెరి దుఃఖసుఖములు - సరిగా భావింతున్ = పరిశుద్ద్ధాత్ముని వేం డి - పరితృప్తి నుండు ॥నానంద మగు॥ 2. బహు శోధనలు నాపై - బడి వచ్చునపుడు - నహితాంధతమము న - న్నడ్డుకొన్నపుడు - నిహబాధ లన్నిన - న్నెదిరించినపుడు = నహహ యేసునివల్ల - నమృతుండ నెపుడు ॥నానంద మగు॥ 3. ముందు నా మనసు దే-వుని కప్పగింతు-నందరి నస్మత్తు-ల్యముగాయ ప్రేమింతున్ - సందేహ రాహిత్య - సరణిలో నిల్తుం = పొందం బోయెడి ముక్తి - భువి యందె గాంతు ॥నానంద మగు॥ Aananda Magu Mukthi - Ye Naa Mandiramu = Gnaani Maanugan Joochu - Daani Sundaramu ॥Aanandamagu॥ 1. Paradeshivale Dehaa - Varanaman Dundun - Dharani Kaananamugaa - Darshinchu Chundun - Neri Duhkhasukhamulu - Sarigaa Bhaavinthun = Parishudddhaathmuni Ven Di - Parithrupthi Nundu ॥Naananda Magu॥ 2. Bahu Shodhanalu Naapai - Badi Vachchunapudu - Nahithaandhathamamu Na - Nnaddukonnapudu - Nihabaadha Lannina - Nnedirinchinapudu = Nahaha Yesunivalla - Namruthunda Nepudu ॥Naananda Magu॥ 3. Mundu Naa Manasu De-Vuni Kappaginthu-Nandari Nasmaththu-Lyamugaaya Preminthun - Sandeha Raahithya - Saranilo Nilthun = Pondan Boyedi Mukthi - Bhuvi Yande Gaanthu ॥Naananda Magu॥