ఆనందించెదము యెహోవాలో - YouWorship
Aanandinchedamu Yehovaalo
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: ఆనందించెదము యెహోవాలో (2) - అతిశయించును మాదు ఆత్మ (2) రక్షణ వస్త్రములతో యెహోవా మమ్ము (2) - నీతి వస్త్రమున్ ధరింప జేసె (2) ఆనందించెదము యెహోవాలో (2) 1. పరదేశులు మమ్ము ప్రభువా దేవా (2) - నీదు యాజక సేవకులనెదరు (1) పరదేశులు మమ్ము ప్రభువా దేవా (2) - నీదు యాజక సేవకులనెదరు (1) జగమున జనముల భాగ్యంబిచ్చి - ప్రభవింతు రంటివి ప్రభావముతో (2) 2. అన్యులు చేసిన అవమానమునకు - ప్రతిగా మాకు రెట్టింపు ఘనతను అన్యులు చేసిన అవమానమునకు - ప్రతిగా మాకు రెట్టింపు ఘనతను నిందకు ప్రతిగా పొందిన భాగము - అనుభవించుచు హర్షింతు రంటివి 3. వారు తమదు దేశమునందు - రెట్టింపు భాగమునకు కర్తలౌదురు వారు తమదు దేశమునందు - రెట్టింపు భాగమునకు కర్తలౌదురు నిత్యానందము వారికి కలుగును - ఎన్నడు వారిని విడువ నంటివి 4. న్యాయము చేయుట నాకెంతో ప్రీతి - అన్యాయపు సొత్తు నా కసహ్యము న్యాయము చేయుట నాకెంతో ప్రీతి - అన్యాయపు సొత్తు నా కసహ్యము సత్యముబట్టి ప్రతిఫల మిచ్చుచు - నిత్య నిబంధన చేసెదనంటివి 5. జనములకు వారి సంతతి తెలియును - జనముల మధ్యను ప్రసిద్ధి నొందును జనములకు వారి సంతతి తెలియును - జనముల మధ్యను ప్రసిద్ధి నొందును యెహోవా ఆశీర్వదించిన జనమని - ఒప్పుకొందురు చూచినవారు 6. భూమి మొలకను మొలిపించినట్లుగా - తోటలో మొలిచిన విత్తనమువలె భూమి మొలకను మొలిపించినట్లుగా - తోటలో మొలిచిన విత్తనమువలె జనముల యెదుట ప్రభు యెహోవా - నీతిస్తోత్రములను ఉజ్జీవింపజేయును 7. క్రీస్తునందు మాకిచ్చినయట్టి - ఆత్మ బంధిత ప్రతి ఆశీస్సులకై క్రీస్తునందు మాకిచ్చినయట్టి - ఆత్మ బంధిత ప్రతి ఆశీస్సులకై సర్వోన్నతుడా సన్నుతించుచు - హల్లెలూయ స్తోత్రముల్ ఆరోపింతుము Pallavi: Aanandinchedamu Yehovaalo (2) - Athishayinchunu Maadu Aathma (2) Rakshana Vasthramulatho Yehovaa Mammu (2) - Neethi Vasthramun Dharimpa Jese (2) Aanandinchedamu Yehovaalo (2) 1. Paradeshulu Mammu Prabhuvaa Devaa (2) - Needu Yaajaka Sevakulanedaru (1) Paradeshulu Mammu Prabhuvaa Devaa (2) - Needu Yaajaka Sevakulanedaru (1) Jagamuna Janamula Bhaagyambichchi - Prabhavinthu Rantivi Prabhaavamutho (2) 2. Anyulu Chesina Avamaanamunaku - Prathigaa Maaku Rettimpu Ghanathanu Anyulu Chesina Avamaanamunaku - Prathigaa Maaku Rettimpu Ghanathanu Nindaku Prathigaa Pondina Bhaagamu - Anubhavinchuchu Harshinthu Rantivi 3. Vaaru Thamadu Deshamunandu - Rettimpu Bhaagamunaku Karthalauduru Vaaru Thamadu Deshamunandu - Rettimpu Bhaagamunaku Karthalauduru Nithyaanandamu Vaariki Kalugunu - Ennadu Vaarini Viduva Nantivi 4. Nyaayamu Cheyuta Naakentho Preethi - Anyaayapu Soththu Naa Kasahyamu Nyaayamu Cheyuta Naakentho Preethi - Anyaayapu Soththu Naa Kasahyamu Sathyamubatti Prathiphala Michchuchu - Nithya Nibandhana Chesedanantivi 5. Janamulaku Vaari Santhathi Theliyunu - Janamula Madhyanu Prasiddhi Nondunu Janamulaku Vaari Santhathi Theliyunu - Janamula Madhyanu Prasiddhi Nondunu Yehovaa Aasheervadinchina Janamani - Oppukonduru Choochinavaaru 6. Bhoomi Molakanu Molipinchinatlugaa - Thotalo Molichina Viththanamuvale Bhoomi Molakanu Molipinchinatlugaa - Thotalo Molichina Viththanamuvale Janamula Yeduta Prabhu Yehovaa - NeethiSthothramulanu Ujjeevimpajeyunu 7. Kreesthunandu Maakichchinayatti - Aathma Bandhitha Prathi Aasheessulakai Kreesthunandu Maakichchinayatti - Aathma Bandhitha Prathi Aasheessulakai Sarvonnathudaa Sannuthinchuchu - Hallelooya Sthothramul Aaropinthumu