ఆనందించెదము ప్రభు యేసులో - YouWorship
Aanandinchedamu Prabhu Yesulo
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: నష్టము నంతటిని మరల - మా యేసునిలో ఆర్జించితిమి (1) ఎల్లప్పుడు జీవితమతయు హల్లెలూయ పాడెదము (1) 1. ఆనందించెదము - ప్రభు యేసులో - అంతయు మరలార్జించు కొంటిమి (1) ఆదాము నుండి పోయిన దెల్లయు - అనుభవించు చున్నామిప్పుడు (1) 2. దావీదువలె అంత నష్టపడితిమి - దుఃఖపడి బహుగా ఏడ్చితిమి దావీదువలె ప్రభుని వెదకగ - తిరిగి ఆర్జించుకొంటిమి || న || 3. పూర్వము నైక్యము లేకపోయెను - పేదలమై యుంటిమి అపుడు మనలను ఖాళీ చేసికొనగా - మరల నొందితిమి పూర్ణత || న || 4. మొదటి ప్రమను కోల్పోతిమిల - వ్యర్థమైనట్టి ప్రేమనొందితిమి పొందితిమి యేసు ప్రభువులో - నిండుగను దైవ ప్రేమను || న || 5. దేవుని కల్గియుండకుంటిమి - దైవసమాధాన మొందకుంటిమి పాపములలో మరణించియుంటిమి - పరమజీవ మొందితిమి || న || 6. నిరీక్షణయేమి లేక యుంటిమి - నరకమున కర్హులమై యుంటిమి ఘనుడగు యేసు నంగీకరింపగా - నన్నును విమోచించెను || న || 7. పాపము వలనెంతో నష్టపోతిమి - ప్రభులో సకలము సంపాదించితిమి శాపమునందు చుట్టబడితిమి - సర్వమొందెదము మరల || న || Pallavi: Nashtamu Nanthatini Marala - Maa Yesunilo Aarjinchithimi (1) Ellappudu Jeevithamathayu Hallelooya Paadedamu (1) 1. Aanandinchedamu - Prabhu Yesulo - Anthayu Maralaarjinchu Kontimi (1) Aadaamu Nundi Poyina Dellayu - Anubhavinchu Chunnaamippudu (1) 2. Daaveeduvale Antha Nashtapadithimi - Duhkhapadi Bahugaa Edchithimi Daaveeduvale Prabhuni Vedakaga - Thirigi Aarjinchukontimi || Na || 3. Poorvamu Naikyamu Lekapoyenu - Pedalamai Yuntimi Apudu Manalanu Khaalee Chesikonagaa - Marala Nondithimi Poornatha || Na || 4. Modati Pramanu Kolpothimila - Vyarthamainatti Premanondithimi Pondithimi Yesu Prabhuvulo - Ninduganu Daiva Premanu || Na || 5. Devuni Kalgiyundakuntimi - Daivasamaadhaana Mondakuntimi Paapamulalo Maraninchiyuntimi - Paramajeeva Mondithimi || Na || 6. Nireekshanayemi Leka Yuntimi - Narakamuna Karhulamai Yuntimi Ghanudagu Yesu Nanggeekarimpagaa - Nannunu Vimochinchenu || Na || 7. Paapamu Valanentho Nashtapothimi - Prabhulo Sakalamu Sampaadinchithimi Shaapamunandu Chuttabadithimi - Sarvamondedamu Marala || Na ||