ఆనందమే మనకిలలో మన కానందమే - YouWorship
Aanandame Manakilalo Mana Kaanandame
Artist: సీయోను గీతాలు
Category: Easter
Song Lyrics
పల్లవి: ఆనందమే మనకిలలో ఆ... ఆ... (2) - మన కానందమే ప్రభు లేచెన్ (1) ఆనందమే మనకిలలో (2) 1. పాపుల మిత్రుడు - పాప రహితుడు (2) - పాపులకొరకై - శాప గ్రాహియై (2) మోపుగ శాపము - వీపున మోసె పాపపు ఋణము తీర్చె (2) 2. పొంతిపిలాతు మసుఖమునందు - శాస్త్రుల పెద్దల యేదుటను నిలిచె స్తోత్రార్హుండు - మరణము గెలిచె - సైతానును ఓడించె 3. మరణము భయము - లేని వారమై - మరణమున్ గెల్చిన - యేసుని జేరి తరుణమును - పోగొట్టుకొనక - పరమ ప్రభువును చాటన్ 4. లేచిన ప్రభువు ప్రియులను జూచి - గాంచెద నంచు అభయమునిచ్చె (2) తీసివేసెను - చింతయు నంతను - రోసెద మిపుడే లోకమున్ 5. పరమునకేగి - పంపెనాత్మను - పరవశులైరి - శిష్యులు గదిలో కొరతలేని - శక్తిని పొందిరి - శిరముల - నెత్తిచాటిరి 6. మన ప్రభుయేసు వచ్చుచుండె - మనము రెప్ప పాటున మారి తనివి దీరగా - సంతసించి - వినయుని చేరెదము 7. మహిమ కిరీట ధారులమై - మహిమ వస్త్రములు ధరించి మహిమగల - రాజుతో నుండి - మహిని పాలించెదము Pallavi: Aanandame Manakilalo Aa... Aa... (2) - Mana Kaanandame Prabhu Lechen (1) Aanandame Manakilalo (2) 1. Paapula Mithrudu - Paapa Rahithudu (2) - Paapulakorakai - Shaapa Graahiyai (2) Mopuga Shaapamu - Veepuna Mose Paapapu Runamu Theerche (2) 2. Ponthipilaathu Masukhamunandu - Shaasthrula Peddala Yedutanu Niliche Sthothraarhundu - Maranamu Geliche - Saithaanunu Odinche 3. Maranamu Bhayamu - Leni Vaaramai - Maranamun Gelchina - Yesuni Jeri Tharunamunu - Pogottukonaka - Parama Prabhuvunu Chaatan 4. Lechina Prabhuvu Priyulanu Joochi - Gaancheda Nanchu Abhayamunichche (2) Theesivesenu - Chinthayu Nanthanu - Roseda Mipude Lokamun 5. Paramunakegi - Pampenaathmanu - Paravashulairi - Shishyulu Gadilo Korathaleni - Shakthini Pondiri - Shiramula - Neththichaatiri 6. Mana PrabhuYesu Vachchuchunde - Manamu Reppa Paatuna Maari Thanivi Deeragaa - Santhasinchi - Vinayuni Cheredamu 7. Mahima Kireeta Dhaarulamai - Mahima Vasthramulu Dharinchi Mahimagala - Raajutho Nundi - Mahini Paalinchedamu