ఆనందమే పరమానందమే - YouWorship
Aanandame Paramaanandame
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో (2) ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము (2) ||ఆనందమే|| పచ్చిక గల చోట్ల పరుండ జేసితివే జీవ జలములు త్రాగనిచ్చితివే (2) నా ప్రాణమునకు సేదదీర్చితివి నీతియు శాంతియు నాకిచ్చితివే (2) ||ఆనందమే|| గాఢాంధకారము లోయలలో నేను సంచరించినా దేనికి భయపడను (2) నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే (2) ||ఆనందమే|| నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేసావు (2) నీతో నేను నీ మందిరములో నివాసము చేసెద చిరకాలము (2) ||ఆనందమే|| Aanandame Paramaanandame Aashrayapuramaina Yesayyaa Neelo (2) Aapathkaalamulannitilo Aadarinchina Akshayudaa Neeke Sthothramu (2) ||Aanandame|| Pachchika Gala Chotla Parunda Jesithive Jeeva Jalamulu Thraaganichchithive (2) Naa Praanamunaku Sedadeerchithive Neethiyu Shaanthiyu Naakichchithive (2) ||Aanandame|| Gaadaandhakaaramu Loyalalo Nenu Sancharinchinaa Deniki Bhayapadanu (2) Nee Duddu Karrayu Nee Dandamunu Anudinam Anukshanam Kaapaadune (2) ||Aanandame|| Naa Shathruvula Yedute Neevu Naaku Vindunu Siddhamu Chesaavu (2) Neetho Nenu Nee Mandiramulo Nivaasamu Cheseda Chirakaalamu (2) ||Aanandame||