ఆనందముతో ఆరాధింతున్ ఆత్మతోను సత్యముతో - YouWorship
Aanandamutho Aaraadhinthun Aathmathonu Sathyamutho
Artist: సీయోను గీతాలు
Category: Worship
Song Lyrics
"ఆయనను ఆరాధించువారు ఆత్మతోను, సత్యముతోను ఆరాధింపవలెను" యోహాను John 4:24 పల్లవి : ఆనందముతో - ఆరాధింతున్ ఆత్మతోను - సత్యముతో అనుపల్లవి : రక్షణ పాత్ర నేనెత్తుకొని - స్తుతులు నర్పింతును హర్షించి పొగడి పూజింతును - యేసుని నామమును 1. పాపినైన నన్ను రక్షింపను - సిలువపై నాకై తానెక్కెను పరిశుద్ధ జీవం నాకివ్వను - మృత్యుంజయుడై లేచెను || ఆనందముతో || 2. మరణపుటురులలో నేనుండగా - నరరూపియై నా కడ కేతెంచెను పరలోక జీవం నాకివ్వను - మరణపు ముల్లు విరచెను || ఆనందముతో || 3. శత్రుని ఉరి నుండి విడిపింపను - శత్రువుతో నాకై పోరాడెను పదిలంపు జీవం నాకివ్వను - క్రీస్తునందు నను దాచెను || ఆనందముతో || 4. పరలోక పౌరసత్వం నా కివ్వను - పరమును వీడి ధరకేతెంచెను సమృద్ధి జీవం నాకివ్వను - తన ప్రాణమర్పించెను || ఆనందముతో || 5. శోధన వేదన బాధలెన్నో - ఈ లోక యాత్రలో ఎదురైనను ప్రత్యేక జీవం జీవించను - అర్పించుకొందు నీకు || ఆనందముతో || అంగీకరించు - నా జీవితమును - నీ కొరకే ప్రభువా హల్లెలూయ ఆమెన్ - హల్లెలూయ ఆమెన్ - హల్లెలూయ || ఆనందముతో || "Aayananu Aaraadhinchuvaaru Aathmathonu, Sathyamuthonu Aaraadhimpavalenu" Yohaanu John 4:24 Pallavi : Aanandamutho - Aaraadhinthun Aathmathonu - Sathyamutho Anu Pallavi : Rakshana Paathra Neneththukoni - Sthuthulu Narpinthunu Harshinchi Pogadi Poojinthunu - Yesuni Naamamunu 1. Paapinaina Nannu Rakshimpanu - Siluvapai Naakai Thaanekkenu Parishuddha Jeevan Naakivvanu - Mruthyunjayudai Lechenu || Aanandamutho || 2. Maranaputurulalo Nenundagaa - Nararoopiyai Naa Kada Kethenchenu Paraloka Jeevan Naakivvanu - Maranapu Mullu Virachenu || Aanandamutho || 3. Shathruni Uri Nundi Vidipimpanu - Shathruvutho Naakai Poraadenu Padilampu Jeevan Naakivvanu - Kreesthunandu Nanu Daachenu || Aanandamutho || 4. Paraloka Paurasathvan Naa Kivvanu - Paramunu Veedi Dharakethenchenu Samruddhi Jeevan Naakivvanu - Thana Praanamarpinchenu || Aanandamutho || 5. Shodhana Vedana Baadhalenno - Ee Loka Yaathralo Edurainanu Prathyeka Jeevan Jeevinchanu - Arpinchukondu Neeku || Aanandamutho || Anggeekarinchu - Naa Jeevithamunu - Nee Korake Prabhuvaa Hallelooya Aamen - Hallelooya Aamen - Hallelooya || Aanandamutho ||