ఆద్యంత రహిత ప్రభువా - YouWorship
Aadyantha Rahitha Prabhuvaa
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: ఆద్యంత రహిత ప్రభువా - రాజులకు రాజా ప్రభు యేసూ నీవే సదా (2) 1. ఆది జనకుడు ఏదేను తోటలో - శోధనలో పడి వేధించినపుడు (2) ఆశలన్ని అడియాశలుగా జేసె (1) అధములను నీవు ఆదరింతువు - అమృతమూర్తి నీవే ప్రభూ! సాటి నీకెవరు? (2) 2. స్థానము విడచి తన మహిమ విడచి - అనుదినము నిను దూషించు వైరి ప్రధానత్వమును పాడుచేసికొని నీ ప్రభుత్వమున్ నిరాకరించిన - నీచున్ ప్రేమించితివి ప్రభూ! సాటి నీకెవరు? 3. పిలిచితివి ఇశ్రాయేలు సంతతిని - వేలకొలది వాగ్దానములతో కలిమియందున కలతలందున తొలగిపోయిన తల్లడిల్లిన - చల్లగ కాచితివి ప్రభూ! సాటి నీకెవరు? 4. రాజ్యమేలిరి రారాజు లెందరో - రాజనగరుల రత్నాల సిరులతో రాజ్యకాంక్షతో రణములు సలిపిరి రథములను చూచి సదయున్ మరచిన - నిత్య సాత్వీకుడవు ప్రభూ! సాటి నీకెవరు? 5. పరమ జనకుని పలు వాక్కు లెన్నియో - ధరను ప్రజలకు ప్రవచించు కొరకై నిర్ణయించితివి దైవజనులను పేరాశ కలిగి పెడత్రోవ నడచిన - కరుణించితివి వారిన్ ప్రభూ! సాటి నీకెవరు? 6. పాడెదన్ ప్రభూ నీ ప్రేమ గీతమ్ - పడిచెడిన నన్ను ప్రేమించితివివని కడిగితివి ప్రభు - కలుషము నెల్ల విడచిన నేను నీ జాడలన్నియు - నడిపించె నావికుడ ప్రభూ! సాటి నీకెవరు? Pallavi: Aadyantha Rahitha Prabhuvaa - Raajulaku Raajaa Prabhu Yesoo Neeve Sadaa (2) 1. Aadi Janakudu Edenu Thotalo - Shodhanalo Padi Vedhinchinapudu (2) Aashalanni Adiyaashalugaa Jese (1) Adhamulanu Neevu Aadarinthuvu - Amruthamoorthi Neeve Prabhoo! Saati Neekevaru? (2) 2. Sthaanamu Vidachi Thana Mahima Vidachi - Anudinamu Ninu Dooshinchu Vairi Pradhaanathvamunu Paaduchesikoni Nee Prabhuthvamun Niraakarinchina - Neechun Preminchithivi Prabhoo! Saati Neekevaru? 3. Pilichithivi Ishraayelu Santhathini - Velakoladi Vaagdaanamulatho Kalimiyanduna Kalathalanduna Tholagipoyina Thalladillina - Challaga Kaachithivi Prabhoo! Saati Neekevaru? 4. Raajyameliri Raaraaju Lendaro - Raajanagarula Rathnaala Sirulatho Raajyakaangkshatho Ranamulu Salipiri Rathamulanu Choochi Sadayun Marachina - Nithya Saathveekudavu Prabhoo! Saati Neekevaru? 5. Parama Janakuni Palu Vaakku Lenniyo - Dharanu Prajalaku Pravachinchu Korakai Nirnayinchithivi Daivajanulanu Peraasha Kaligi Pedathrova Nadachina - Karuninchithivi Vaarin Prabhoo! Saati Neekevaru? 6. Paadedan Prabhoo Nee Prema Geetham - Padichedina Nannu Preminchithivivani Kadigithivi Prabhu - Kalushamu Nella Vidachina Nenu Nee Jaadalanniyu - Nadipinche Naavikuda Prabhoo! Saati Neekevaru?