ఆదియంతము లేనివాడా - YouWorship
Aadiyanthamu Lenivaadaa
Artist: Unknown Artist
Category: Worship
Song Lyrics
ఆదియంతము లేనివాడా సంపూర్ణుడగు మా దేవా నీతిజ్ఞానము కలవాడా జ్యోతికి నిలయము నీవే అబ్రాహామును పిలిచితివి – ఆ వంశమున బుట్టితివి అనాధులకు దిక్కు నీవే – అనాధుడవై వచ్చితివి ||ఆదియంతము|| ఇస్సాకును విడిపించి – యేసయ్యా బలియైనావా యూదాచే నమ్మబడితివి – పాపులకై మరణించితివి ||ఆదియంతము|| యోనావలె మూడు దినముల్ – భూగర్భమున నీవుండి మానవులను రక్షింప – మహిమతోడ లేచితివి ||ఆదియంతము|| పండ్రెండు గోత్రముల – జెంది – పండ్రెండు శిష్యుల జనకా కన్యపుత్రుడవై సీయోను – కన్యను వరించితివి ||ఆదియంతము|| దావీదు కుమారుడవు – దావీదుకు దేవుడవు కాపాడుచు నున్నావు – పాపిని నన్ను ప్రేమించి ||ఆదియంతము|| Aadiyanthamu Leni Vaadaa Sampoornudagu Maa Devaa Neethi Gnaanamu Kalavaadaa Jyothiki Nilayamu Neeve Abrahaamunu Pilichithivi – Aa Vamshamuna Buttithivi Anaadhulaku Dikku Neeve – Anaadhudavai Vachchithivi ||Aadiyanthamu|| Issaakunu Vidipinchi – Yesayyaa Baliyainaavaa Yoodaache Nammabadithivi – Paapulakai Maraninchithivi ||Aadiyanthamu|| Yonaa Vale Moodu Dinamul – Bhoo Garbhamuna Neevundi Maanavulanu Rakshmipa – Mahima Thoda Lechithivi ||Aadiyanthamu|| Pandrendu Gothramula – Jendi – Pandrendu Shishyula Janakaa Kanya Puthrudavai Seeyonu – Kanyanu Varinchithivi ||Aadiyanthamu|| Daaveedu Kumaarudavu – Daaveeduku Devudavu Kaapaaduchununnaavu – Paapini Nannu Preminchi ||Aadiyanthamu||